ఆంజనేయ స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టేందుకు తెలుగు రాష్ట్రాల్లో జనాలు క్యూకడుతున్నారు. కనుమ పర్వదినాన ఎందుకింత హడావుడి అనుకుంటున్నారా ?. అమావాస్య నాడు కనుమ రావడం చేటు అనేది కొందరి భావన...ఈ రోజు అమావాస్య కావడం..ఇదే రోజు కనుమ పండగ రావడంతో.. ఇది అరిష్టమని దీన్నుంచి బయటపడాలంటే హనుమంతుని గుడిలో చిన్న పిల్లలతో ప్రదక్షిణలు చేయించాలని నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో  కొబ్బరికాయలు కొట్టేందుకు ఈ రోజు హనుమాన్ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరిష్టం ఎందుకంటే..?
అమావాస్య రోజున కనుమ పండగ రావడంతో కష్టాలు సంభవిస్తాయని..   దీన్నుంచి బయటపడాలంటే చిన్నపిల్లలున్న తల్లులు వారిని తీసుకుని దేవాలయాలకు వెళ్లాలని, ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టాలట. నిన్నటి నుంచి ఈ పుకార్లు షికారు చేస్తున్నాయి. పిల్లలున్న వారు హనుమంతుని గుడిలో సాధ్యమైనంత బరువున్న కొబ్బరికాయ కొట్టేందుకు ఆంజనేయుని దేవాలయాల్లో క్యూకట్టారు..


పుకార్లను నమ్మోద్దు..


అమావాస్య రోజున కనుమ పండగ రావడంతో కష్టాలు సంభవిస్తాయనేది...ఇదంతా ఉత్తుత్తి పుకారేనని.. నమ్మాల్సిన అవసరం లేదని కొందరు అర్చకులు వాదిస్తున్నారు. కాగా అమావాస్య రోజు కనుమ పండగ రావడం అరిష్టమంటూ పూకార్లు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవడంతో ఆంజనేయుని దేవాలయాల ముందు భక్తుల క్యూ లైన్లు పెరిగిపోయాయి. దీంతో కొబ్బరికాయలకు ఎక్కడలేని డిమాండ్ రాగా.. వ్యాపారులు అధిక ధరలకు వాటిని విక్రయిస్తున్నారు.