Kodali Nani Comments: బాలకృష్ణకి కొడాలి నాని కౌంటర్..వీర తిలకం దిద్ది పంపిన అల్లుళ్లను ఇంటికి పంపినట్టే పంపుతారు!
Kodali Nani Comments on Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ కు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Kodali Nani Sensational Comments on Balakrishna: కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారంటూ నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణకు పలువురు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొడాలి నాని బాలయ్యకు పరోక్షంగా కౌంటర్ వేశారు.
ప్రజల్లో విశ్వాసం కార్యకర్తల్లో నమ్మకం లేని వారికి జగన్ ఈసారి సీట్లు ఇవ్వడని విశ్వాసం లేని ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వాన్ని ప్రజలని పణంగా పెట్టనని జగన్ ఇప్పటికే చెప్పేసాడని చెప్పుకొచ్చారు. ప్రజల్లో మమేకమవుతూ వారి అభిమానాన్ని పొందిన వారికి జగన్ తప్పకుండా సీట్లు ఇస్తాడని వైసీపీ నుంచి సీట్లు రావని భావించిన ఎమ్మెల్యేలు చంద్రబాబులో టచ్ లో ఉంటే మాకు ఏమవుతుంది అని ప్రశ్నించారు. ఎన్నికల ఏడాదిలో ప్రజలతో టచ్ లో ఉండాలి గాని ప్రజాధరణ కోల్పోయి టికెట్ కూడా దక్కించుకోవడానికి సిద్ధంగా లేని ఎమ్మెల్యేలు కాదని ఆయన అన్నారు.
Also Read: Punch Prasad Hospitalised: జబర్దస్త్ కమెడియన్ కు అస్వస్థత.. మళ్ళీ హాస్పిటల్లో చేరిన పంచ్ ప్రసాద్!
ఇక చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటన గురించి స్పందించిన కొడాలి నాని 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు గుడివాడ వచ్చి కొత్తగా ఏం చెబుతాడని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు గుడివాడ వచ్చినా బెజవాడ వచ్చినా ఎక్కడ తిరిగినా శ్రమ, ఆయాసం తప్ప ప్రయోజనం ఉండదని అన్నారు. ఆరోజు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రజలను చంద్రబాబు గాలికి వదిలేసాడు అని ఎంతసేపు తన కోటరీ ఆస్తులు పెంచడాకానికి చంద్రబాబు పాటు పడ్డాడని ఆయన అన్నారు.
చంద్రబాబు నైజం ఏమిటో అందరికీ తెలుసు అని విమర్శించిన కొడాలి నాని బాలకృష్ణ వీర తిలకం దిద్ది పంపిన అల్లుళ్లను వెనక్కి ఇంటికి పంపినట్టే బావ బావమరుదులైన బాలకృష్ణ చంద్రబాబులను సైతం వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపుతాడని అన్నారు. వై నాట్ అంటున్న నందమూరి బాలకృష్ణకు ఎన్నికల్లో జగన్ అంటే ఏంటో చూపిస్తాడని ఈ సందర్భంగా కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. మరి ఈ కామెంట్స్ కి తెలుగుదేశం నుంచి ఎలాంటి కౌంటర్లు వస్తాయనేది చూడాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook