Punch Prasad Hospitalised: జబర్దస్త్ కమెడియన్ కు అస్వస్థత.. మళ్ళీ హాస్పిటల్లో చేరిన పంచ్ ప్రసాద్!

Jabardasth Punch Prasad Hospitalised News: జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ మరోమారు అనారోగ్యం పాలైనట్టు తెలుస్తోంది, ఆయనని హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టు వీడియో విడుదల చేశారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 9, 2023, 07:00 PM IST
Punch Prasad Hospitalised: జబర్దస్త్ కమెడియన్ కు అస్వస్థత.. మళ్ళీ హాస్పిటల్లో చేరిన పంచ్ ప్రసాద్!

Jabardasth Punch Prasad Hospitalised: జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. పంచ్ ప్రసాద్ కి అనారోగ్యం ఉందన్న సంగతి విషయం తెలుసుకుని జబర్దస్త్ లో నాగబాబు, రోజా ఉన్నప్పుడే తలా కొంత డబ్బులు వేసుకుని మరీ ఆయన చికిత్సకు డబ్బులు విరాళంగా ఇచ్చారు. తర్వాత మల్లెమాల సంస్థ కూడా కొంత సహాయం చేసిందని చెబుతూ ఉంటారు.

కిడ్నీ సంబంధిత సమస్య కావడంతో ఆయన ఎప్పటికప్పుడు రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. అయితే డయాలసిస్ ఎప్పటికప్పుడు చేయించుకుంటున్నా ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని రోజు రోజుకు కొత్త కొత్త అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టూ ముడుతున్నాయని తెలుస్తోంది. తాజాగా తీవ్రమైన జ్వరంతో పంచ్ ప్రసాద్ హాస్పిటల్ లో జాయిన్ అయినట్లుగా చెబుతున్నారు. ఆయన గొంతు సమస్యతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అనే విషయాన్ని ఆయన భార్య తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షక లోకానికి వెల్లడించారు.

Also Read: Shruthi Haasan vs Chiranjeevi: వాళ్లకి కోట్లు, శాలువాలు ఇస్తారు.. మేం చీరలో ఇబ్బంది పడినా పట్టించుకోరా?

సదరు వీడియోలో పంచ్ ప్రసాద్ భార్య సునీత మాట్లాడుతూ ఇప్పుడే హాస్పిటల్ కి వచ్చామని ఆయనకు ముందే థైరాయిడ్ సమస్య ఉందని అది ఇప్పుడు తీవ్రంగా మారిందని పేర్కొన్నారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ రిపోర్టులు చూసిన తర్వాత డాక్టర్లు సర్జరీ చేయాలని అన్నారని, అయితే ఆయన కాలికి లెగ్ ఇన్ఫెక్షన్ ఉండడంతో సర్జరీ ఇప్పుడే వద్దని పేర్కొన్నారని చెప్పుకొచ్చారు. లెగ్ ఇన్ఫెక్షన్ తగ్గినా తర్వాత సర్జరీ చేస్తామని డాక్టర్లు అన్నారని అంతవరకు వెళ్లకుండా మెడిసిన్స్ తోనే తగ్గాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని ఆమె అన్నారు.

ఇక ప్రసాద్ కుడి చేతిపై ఇప్పటి వరకు 50 ఇంజెక్షన్లు చేశారని, డయాలసిస్‌ నొప్పి తట్టుకోలేమని డయాలసిస్‌ తర్వాత క్లీడ్‌ ఇచ్చినపుడు కొంచెం బాగానే ఉంటుందని ఆమె పేర్కొంది. ప్రసాద్‌ ఇంజెక్షన్లు అంటే భయపడిపోతున్నాడని, ఫ్లూయిడ్స్‌ ఎక్కించుకోవటానికి ఇంకా ఇబ్బంది పడుతున్నాడని ఆమె చెప్పుకొచ్చారు. ఇక అందరు జబర్దస్త్ కమెడియన్ల లానే పంచ్ ప్రసాద్ కూడా తన పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు.

తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను, తన అనారోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో ఈ ఛానల్ ద్వారా ఆయన పంచుకుంటూ ఉంటారు. జబర్దస్త్ తో పాటు మల్లెమాల సంస్థ నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు వంటి షోస్ ద్వారా పంచ్ ప్రసాద్ మంచి పేరు సంపాదించాడు. అయితే ఆయన అనారోగ్యం మీద కూడా కొందరు కమెడియన్లు షోస్ లో కామెడీ చేస్తూ ఉంటే దాన్ని కూడా పంచ్ ప్రసాద్ చాలా సీరియస్గా తీసుకోకుండా సరదాగా తీసుకుంటూ ఉంటారు.

Also Read: Pooja Hegde Hot Photos: బాడీ కాన్ డ్రెస్సులో పూజా అందాలు.. మత్తెక్కిస్తూ కవ్విస్తోందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News