Shruthi Haasan Vs Chiranjeevi: వాళ్లకి కోట్లు.. శాలువాలు ఇస్తారు.. మేం చీరలో ఇబ్బంది పడినా పట్టించుకోరా..?

Shruthi Haasan Comments on Waltair Veerayya: సినిమా విడుదలైన మూడు నెలల తరువాత శృతి హాసన్ వాల్తేరు వీరయ్య సినిమాను ఉద్దేశించి చేసిన కామెంట్లు ఇప్పుడు కొత్త రచ్చకు దారి తీస్తున్నాయి. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే..

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 11, 2023, 08:09 PM IST
Shruthi Haasan Vs Chiranjeevi: వాళ్లకి కోట్లు.. శాలువాలు ఇస్తారు.. మేం చీరలో ఇబ్బంది పడినా పట్టించుకోరా..?

Shruthi Haasan Comments on Waltair Veerayya Sridevi Song: మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని మెగాస్టార్ సత్తా ఏమాత్రం తగ్గలేదు అనే విషయాన్ని ప్రూవ్ చేసింది. చాలా సంవత్సరాల తర్వాత వింటేజ్ మెగాస్టార్ ని మరోసారి చూసామంటూ మెగా ఫ్యాన్స్ ఈ సినిమాతో సంబరాలు సైతం చేసుకున్నారు. ఈ సినిమా విడుదల దాదాపు మూడు నెలలు కావస్తుండగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ నటించిన శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి ఆమె మాట్లాడిన మాటల్లో ఏ మాత్రం తప్పు లేదు తాజాగా ఆమె ఒక తమిళ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు మంచులో డాన్స్ చేయడం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా హీరోలకు కోట్ల, షాల్స్ ఇస్తారని మాకు మాత్రం అలాంటివి ఏమీ ఇవ్వకుండానే జాకెట్టు, చీర ధరించి డాన్స్ చేయమంటే ఎలా అని ఆమె ఎదురు ప్రశ్నించింది. ఆమె వెర్షన్ కరెక్ట్ గానే అనిపిస్తోంది. కానీ గతంలో జరిగిన అంశాలన్నింటినీ బేరీజు వేసి చూస్తే వాల్తేరు వీరయ్య సినిమా యూనిట్కు ఆమెకు దూరం పెరగడానికి ఇదే కారణమేమో అనే వాదన వినిపిస్తోంది.

జానికి ఒకే సమయంలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ఒకరోజు ముందు జరిగిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆమె హాజరైంది. కానీ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం డుమ్మా కొట్టింది. జ్వరం వచ్చిందని శృతిహాసన్ చెప్పిందంటూ మెగాస్టార్ కామెంట్ చేస్తూ అక్కడ ఎవరైనా ఏమైనా భయపెట్టారేమో అంటూ కూడా కామెంట్లు చేశారు.

Also Read: Allu Arjun vs NTR: రామ్ చరణ్, చిరంజీవి కంటే ఎన్టీఆర్ ఎక్కువయ్యాడా? కొత్త వివాదానికి కారణమవుతున్న 'బావ'?

అప్పట్లో ఈ విషయం మీద కూడా కొంతవరకు చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం శృతిహాసన్ మాట్లాడిన మాటలకు కొత్త అర్ధాలు వెతుకుతున్నారు నెటిజన్లు. మంచులో డాన్స్ చేయడం కష్టం కాబట్టి ఇలాంటివి ఆపేయాలని అభ్యర్థిస్తున్నాను అంటూ ఆమె కామెంట్ చేసింది, ఇదే విషయాన్ని సినిమా రిలీజ్ కంటే ముందు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో కూడా ఆమె ప్రస్తావించింది కానీ అప్పట్లో అంతగా హైలైట్ అవ్వలేదు. ఇప్పుడు శృతిహాసన్ సినిమా ప్రమోషన్స్ కు దూరం దూరంగా వ్యవహరించడానికి ఇదే కారణమేమో అనే చర్చ మొదలైంది.

చిరంజీవికి, సినిమా యూనిట్ కు దూరం జరగడానికి కూడా ఇదే కారణమేమో అనే వాదన వినిపిస్తోంది. అయితే మెగా అభిమానులు మాత్రం ఏదైనా ఇబ్బంది ఉంటే అప్పుడే చెప్పి ఉంటే మెగాస్టార్ లాంటి వ్యక్తి పక్కన ఉండగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునేవారు కదా. అప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు కావాలనే సినిమా మీద సినిమా యూనిట్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి. 

Also Read: Rajamouli weapons list: సింగమలై కత్తి నుంచి బాహుబలి కత్తి దాకా.. జక్కన్న సృష్టించిన ఆయుధాలు చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News