MLA Nallapareddy Prasanna Kumar Reddy Tears: 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జోరుగా నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ.. సంక్షేప పథకాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 45వ రోజు ఇందుకూరుపేట మండలం జగదేవిపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలం పురందరపురం పంచాయతీలో ఆయన పర్యటించారు. ఇంటింటికి పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నియోజకవర్గంలో కులమత పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యమన్నారు. ఎవరికైనా అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ లబ్ధి అందడం లేదని చెబితే.. వెంటనే సంబంధిత సచివాలయ సిబ్బందితో పరిశీలించి వారికి అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.


అనంతరం బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామంలో గుండెపోటుతో మరణించిన యాట అశోక్ కుటుంబాన్ని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబంతో పాటు.. చెల్లాయపాళెం గ్రామంలో  గుండెపోటుతో మరణించిన అత్తిపాటి గోపి కుటుంబానికి లక్ష రూపాయలు తన తండ్రి స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ట్రస్టు తరపున మొత్తం రూ.2 లక్షలు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.


మృతి చెందిన వైసీపీ కార్యకర్తల కుటుంబాల సమస్యలు తెలుసుకుని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనను చూసి పక్కన ఉన్న పార్టీ నేతలు కూడా కంటతడి పెట్టారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని ఆ కుటుంబాలకు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన వెంట వైసీపీ నాయకులు ఉన్నారు. 


Also Read: Munugode Bypoll: రణరంగంగా మారిన మునుగోడు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల కారుపై రాళ్ల దాడి


Also Read: India Vs Bangladesh: రేపు బంగ్లాతో భారత్ ఢీ.. పంత్ ప్లేస్‌పై రాహుల్ ద్రావిడ్ ట్విస్ట్  
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook