/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Munugode Bypoll:  తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచార గడువు కొన్ని గంటల్లో ముగుస్తుంది అనగా పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. మునుగోడు మండలం పలివెల రణరంగంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఈటల కారు ధ్వంసం అయింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో టీఆర్ఎస్ నేతలు కూడా గాయపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు జిల్లా జడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్ సహా పలువురు టీఆర్ఎస్ నేతలు గాయపడ్డారు.

పలివెల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అత్తగారి ఊరు. ప్రచారం చివరి రోజు కావడంతో ఈటల ర్యాలీ తీస్తున్నారు. మునుగోడులో జరగనున్న మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శనగా వెళుతున్నారు. ఈ సందర్భంగా  ఇరువర్గాలు ఎదురుపడటంతో గొడవ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఈ సందర్భంగానే కొందరు ఎమ్మెల్యే రాజేందర్ కాన్వాయ్ పై దాడికి దిగారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. దాదాపు అరగంట పాటు ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పలివెల రణరంగం అయింది. పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పలివెలలో ప్రస్తుతం పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.

పలివెల ఘర్షణపై టీఆర్ఎస్, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీజేపీ ట్రాప్ లో పడొద్దని, టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. గొడవలు స్పష్టించి అలజడి రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పారు. వాళ్లకు వాళ్లే దాడి చేసుకుని హంగామా చేస్తారని హరీష్ రావు ఆరోపించారు. మరోవైపు కమలనాధులు మాత్రం అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పలివెలలో ఈటల సభ జరగకుండా చూడాలనే దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరుండి మరీ దాడి చేయించారని అన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ గుండాయిజం చేస్తుందని ధ్వజమెత్తారు.

Also Read: Minister KTR: సీఎం జగన్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..!  

Also Read: Bigg Boss Faima : ఫైమాకు మూడింది.. వెటకారం మరీ ఎక్కువైంది.. ఈ వారం బయటకు వచ్చేస్తుందోచ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Section: 
English Title: 
TRS WORKERS ATTACK BJP MLA ETELA RAJENDER CAR IN MUNUGODE
News Source: 
Home Title: 

Munugode Bypoll: రణరంగంగా మారిన మునుగోడు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల కారుపై రాళ్ల దాడి

Munugode Bypoll: రణరంగంగా మారిన మునుగోడు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల కారుపై రాళ్ల దాడి
Caption: 
ETELA RAJENDER CAR
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

రణరంగంగా మారిన పలివెల

టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాళ్ల దాడి

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కారు ధ్వంసం

Mobile Title: 
Munugode Bypoll: రణరంగంగా మారిన మునుగోడు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల కారుపై రాళ్ల దాడి
Srisailam
Publish Later: 
No
Publish At: 
Tuesday, November 1, 2022 - 14:50
Request Count: 
100
Is Breaking News: 
No