Heavy rains in Telangana, AP: హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలతో పోటెత్తిన భారీ వరదలు ( Floods in Telangana and AP ) కారణంగా పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా అనేక ప్రాంతాల్లో జనం సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. పంటలు, పొలాలు వరదల్లో మునిగిపోవడంతో చేతికొచ్చే పంటలు వరదల పాలయ్యాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన నష్టాన్ని అంచనా వేసే పరిస్థితి లేదు. వర్షాలు తగ్గి, వరదలు తగ్గుముఖం పడితే యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టి బాధితులకు సత్వర ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారులకు ఆదేశాలు జారీచేశాయి. Also read : FIR against Kathi Kartika: దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి కత్తి కార్తికపై చీటింగ్ కేసు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుండగా మధ్య బంగాళాఖాతంలో ( Central bay of Bengal ) ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ఏర్పడిన 24 గంటల తర్వాత అది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఫలితంగా నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 


మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పరిస్థితి ఇలా ఉండగా.. ప్రస్తుతం ఉత్తర మహారాష్ట్ర తీరానికి సమీపంలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ( Arabia sea ) తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతోనూ తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. Also read : CBI Case Effect: రఘురామకృష్ణంరాజుకు ఉద్వాసన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe