Machilipatnam Lok Sabha Election Result 2024: మచిలీపట్నం గెలిచేది ఎవరు? బాలశౌరీ హ్యాట్రిక్ కొట్టేనా?
Machilipatnam Lok Sabha Election Result 2024: మచిలీపట్నంలో గన్నవరం, గుడివాడ, పెడనా, మచిలీపట్నం, పామర్రూ, పెనమలూరు 7 అసెంబ్లీ సెగ్మంట్లు ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వల్లభనేని బాలశౌరీ 571,436 ఓట్లతో టీడీపీకి చెందిన కొనకల్లా నారాయణ రావుపై గెలిచారు.
Machilipatnam Lok Sabha Election Result 2024: మచిలీపట్నంలో గన్నవరం, గుడివాడ, పెడనా, మచిలీపట్నం, పామర్రూ, పెనమలూరు 7 అసెంబ్లీ సెగ్మంట్లు ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వల్లభనేని బాలశౌరీ 571,436 ఓట్లతో టీడీపీకి చెందిన కొనకల్లా నారాయణ రావుపై గెలిచారు. ఈ పోటీలో టీడీపీకి 511,295 ఓట్లు పోలయ్యాయి. అప్పుడు వైసీపీ తరఫున పోటీ చేసిన బాలశౌరీ 60,141 ఓట్ల తేడాతోవ నారాయణ రావుపై గెలిచారు. అయితే, ఈసారి బాలశౌరీ జనసేన తరఫున పోటీ చేశారు మరోసారి మోగించారు ఈయన విజయ ఢంకా మోగిస్తారా? చూడాలి. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీకి 46.02 శాతం ఓట్లు పోలవ్వగా, టీడీపీకి 41.18 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో జనసేన తరఫున బండ్రెడ్డి రాము పోటీ చేయగా ఆయనకు 113,292 ఓట్లు పోలయ్యాయి. అంటే జనసేనకు 9.12 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇదీ చదవండి: Karimnagar Lok Sabha Election Result 2024: కరీంనగర్ గడ్డపై బండి ధూంధామేనా..?
అయితే, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 సార్లు లోక్ సభ ఎన్నికలు నిర్వహించారు. అందులో ఎక్కువ సార్లు 7 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. తెలుగు దేశం పార్టీ 5 సార్లు గెలుపొందింది. అయితే, 1952లో మొదటిసారి మచిలీపట్నం లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా గెలిచింది. ఆ తర్వాత 1962 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నిలిచిన మాదాల వేంకట స్వామి నాయుడు విజయ దుందుభి మోగించారు. కాంగ్రెస్ పార్టీ ఈ నియోగక వర్గంలో 1971-1989 వరకు వరుసగా గెలిచి రికార్డును నెలకొల్పింది. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ పార్టీ తరఫున మొదటిసారి నిలిచిన వల్లభనేని బాలశౌరీ విజయం సాధించారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు పోటీ చేయగా, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరీ, కాంగ్రెస్ తరఫున గోల్లు కృష్ణ పోటీ చేశారు.
ఇదీ చదవండి: Nizamabad Lok Sabha Election Result 2024: ఇందూరు తాలుకా ఎవరు.. ? నిజామాబాద్ ఫలితంపై ఉత్కంఠ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook