Nizamabad Lok Sabha Election Result 2024: ఇందూరు తాలుకా ఎవరు.. ? నిజామాబాద్ ఫలితంపై ఉత్కంఠ..?

Nizamabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా అందరి చూపు లోక్ సభ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ చెబుతున్న డబుల్ మార్క్ అందుకోబోతుందా అనే దానికి మరికాసేట్లో తెర పడనుంది. అందులో నిజామాబాద్ సీటు పై ఉత్కంఠ నెలకొంది.. ?

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 4, 2024, 07:51 AM IST
Nizamabad Lok Sabha Election Result 2024: ఇందూరు తాలుకా ఎవరు.. ? నిజామాబాద్ ఫలితంపై ఉత్కంఠ..?

Nizamabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా 18వ లోక్  సభకు జరిగిన ఎన్నికల ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.  తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా అనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది. అందులో ముఖ్యంగా నిజామాబాద్ లోక్ సభ స్థానంలో ధర్మపురి అరవింద్ రెండోసారి లోక్ సభకు ఎన్నిక అవుతారా లేదా అనేది ఆసక్తి నెలకొంది.

1952లో ఏర్పాటు అయిన నిజామాబాద్ నియోజకవర్గంలో 2024 వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున ధర్మపురి అరవింద్.. కాంగ్రెస్ పార్టీ తరుఫున జీవన్ రెడ్డి పోటీలో ఉండటంతో ఇక్కడ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరుపున బాజీరెడ్డి గోవర్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. ముఖ్యంగా పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంది. మరి ఈ పోటీలో ధర్మపురి అరవింద్ విజేతగా నిలుస్తారా.. ? జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేరుస్తారా అనేది మరికాసేపట్లో తేలిపోనుంది.

నిజమాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ (అర్బన్), నిజామాబాద్ (రూరల్), బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గత 2019  ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్.. అప్పటి టీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవితపై 70,875 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మొత్తం పోలైన ఓట్లలో 45.22 శాతం ఓట్లతో 4,80584 ఓట్లు పోలయ్యాయి. అటు అప్పటి టీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవితకు 38.55 శాతం ఓట్లతో 4,09,709 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన మధుయాష్కికి 69,240 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2031 ఓట్లు పోలయ్యాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x