Karimnagar Lok Sabha Election Result 2024: కరీంనగర్ గడ్డపై బండి ధూంధామేనా..?

Karimnagar Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కమలం విరబూయనుందా అనే దానికి మరికాసేట్లో తేలిపోనుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 4, 2024, 08:17 AM IST
Karimnagar Lok Sabha Election Result 2024: కరీంనగర్ గడ్డపై బండి ధూంధామేనా..?

Karimnagar Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా పలు సర్వే సంస్థలు చెప్పిన ఎగ్జిట్ పోల్ ఆధారంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దుమ్ము దులుపుతుందా అనేది దానికి మరికాసేట్లో తేలిపోనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. అందులో తెలంగాణ  బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత బీజేపీ మాజీ ప్రెసిడెంట్  బండి సంజయ్ రెండోసారి ఈ లోక్ సభ స్థానం నుంచి గెలుస్తాడా అనేది బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.మరోవైపు కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్ధి బోయనపల్లి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. మరోవైపు మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరుపున వెల్లిచర్ల రాజేందర్ రావు బరిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పోటీ బండి సంజయ్ వర్సెస్ వినోద్ కుమార్ మధ్య కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బండి సంజయ్ .. ఆరు నెలలు తిరగ్గాండానే లోక్ సభకు ఎన్నికవుతారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. గత లోక్ సభ ఎన్నికల ముందు జరిగిన 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ  కూడా బండి సంజయ్.. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి తన సమీప TRS అభ్యర్ధి  బోయనపల్లి వినోద్ కుమార్ పై దాదాపు 89,508 మెజారిటీతో గెలుపొందారు.  

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కరీంనగర్, చొప్పదండి (SC), వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు (SC), హూజూరాబాద్, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో బీజేపీ కరీంగనర్, వేములవాడ, సిరిసిల్ల, హుజూరా బాద్ అసెంబ్లీలో వచ్చే మెజారిటీపైనే అభ్యర్ధులు గెలుపు ఓటములు నిర్ణయించబడతాయి.  కరీంనగర్ లోక్ సభ స్థానం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఉప ఎన్నికలతో కలిపి 22 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ ఈ సీటును గెలుచుకుంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత ఈ సీటు నుంచి రెండు ఉప ఎన్నికలతో కలిసి మూడుసార్లు ఈ స్థానం నుంచి గెలవడం విశేషం. బీజేపీ ఈ సీటులో 1988, 1999, 2019 మూడు సార్లు కైవసం చేసుకుంది. తాజాగా 2024లో మొత్తంగా నాలుగు సారి ఈ సీటులో పాగా వేస్తుందా లేదా అనేది చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News