Pawan Chiranjeevi Meet: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇంకా ప్రచారంలోకి పూర్తి స్థాయి చేయకున్నా తెర వెనుక సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలనే కసితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన అన్న మెగాస్టార్‌ చిరంజీవిని కలిసి పవన్‌ కల్యాణ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan Kalyan: జగన్‌లాంటి 'కోడిగుడ్డు' ప్రభుత్వం ఇంకా కావాలా? పవన్‌ కల్యాణ్‌


 చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' షూటింగ్ హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో కొనసాగుతోంది. షూటింగ్‌ జరుగుతున్న ప్రదేశానికి సోమవారం ఉదయం నాగబాబుతో కలిసి పవన్ కల్యాణ్ వెళ్లారు. రాజకీయ యుద్ధం చేస్తున్న తమ్ముడిని చిరంజీవి ఆలింగనం చేసుకుని అభినందించారు. అనంతరం చిరంజీవి ఆశీర్వాదం పవన్‌ పొందారు. పార్టీ స్థాపించి పదేళ్ల తర్వాత రాజకీయంగా చిరంజీవితో పవన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు సోదరులు కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

Also Read: YS Sharmila: ప్రధాని నరేంద్ర మోదీకి మా అన్న జగన్‌ కట్టుబానిస: వైఎస్‌ షర్మిల


ఈ సందర్భంగా వారి మధ్య ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు, అభ్యర్థులు, ఎన్డీయే పొత్తు వంటి అంశాలను చిరంజీవికి పవన్‌, నాగబాబు వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి కొన్ని రాజకీయ సలహాలు పవన్‌కు ఇచ్చినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అనంతరం జనసేన పార్టీకి చిరంజీవి రూ.5 కోట్ల పార్టీ విరాళం ప్రకటించారు. ఆ చెక్‌ను పవన్‌, నాగబాబుకు చిరు అందించారు.


ఎలాగైనా ఎమ్మెల్యే కావాలని..
గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయిన పవన్‌ కల్యాణ్‌ ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేయాల్సి ఉండగా.. వాటిలో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపైనే పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జనసేనకు కేటాయించిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో కూడా పవన్‌ ప్రచారం అంతగా లేదు. వారాహి విజయ భేరి యాత్ర ఇప్పటివరకు పిఠాపురంలో మాత్రమే కొనసాగిన విషయం తెలిసిందే.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook