Midhili Cyclone Effect: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారిపోయింది. అనంతరం నిన్నటికి తుపానుగా బలపడటంతో మిథిలీగా పిలుస్తున్నారు. ఇవాళ బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటే అవకాశమున్నా ఏపీపై ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇప్పటికే తుపానుగా మారింది. మాల్దీవులు దేశం సూచించిన మిథినీ పేరును పెట్టారు. పారాదీప్‌కు సమీపంలో పశ్చిమ బెంగాల్‌లోని దిఘా దాటి వెళ్తోంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోందని తెలుస్తోంది. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బంగాల్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఏపీపై కూడా తుపాను ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. 


మరోవైపు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 28 తరువాత రాష్ట్రంలో వర్షాలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతంలో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఇక దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారముంది.


వర్షాల కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరిచేలు దెబ్బతినే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వరి కోస్తుంటే మరి కొన్ని జిల్లాల్లో కోసిన వరిని కుప్పలుగా పెడుతున్నారు. వర్షాల హెచ్చరిక ఉండటంతో వరి కుప్పలపై గడ్డి, ప్లాస్టిక్ టార్పన్‌లు కప్పుతున్నారు. ఇప్పటివరకూ పంట తీయని రైతులు కోతలు చేయవద్దని అధికారులు సూచించారు.ఈ పరిస్థితుల్లో వర్షాలు పడితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. 


Also read: Heavy Rains: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook