KCR Jobs Announcement: ఏపీలోనూ కేసీఆర్‌కు క్రేజ్.. సీఎం చిత్ర పటానికి పాలాభిషేకాలు...
Milk Bath to TS CM KCR`s Portrait in Andhra: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనకు తెలంగాణలోనే కాదు ఏపీ నుంచి కూడా భారీ స్పందన లభిస్తోంది.
Milk Bath to TS CM KCR's Portrait in Andhra : అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనకు తెలంగాణలోనే కాదు ఏపీ నుంచి కూడా భారీ స్పందన లభిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, నిరుద్యోగులు కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. విశేషమేమిటంటే.. ఏపీలోనూ కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో నిరుద్యోగ జేఏసీ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనను హర్షిస్తూ నిరుద్యోగ జేఏసీ సభ్యులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ సభ్యులు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన వెంటనే నీళ్లు, నిధులపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చారని కితాబిచ్చారు. తాజాగా నియామకాల హామీని కూడా నెరవేర్చారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుద్యోగులకు గొప్ప అవకాశం కల్పించారని పేర్కొన్నారు.
కేసీఆర్ అనూహ్య ప్రకటనతో విపక్షాల విమర్శలను పటాపంచలు చేశారని అన్నారు. ఇంత కాలం టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న నిరుద్యోగులు ఇకపై టీఆర్ఎస్‌కు అండగా ఉండాలని కోరారు. ఏపీలో సీఎం జగన్ కూడా ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కాగా, తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు, జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, యూనివర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఖాళీల వివరాలను సీఎం కేసీఆరే స్వయంగా అసెంబ్లీలో చదివి వినిపించారు. అంతేకాదు, 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ తాజా ప్రకటనపై నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసు.. దోషి పెరారివాలన్‌కు సుప్రీం బెయిల్...
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసు.. దోషి పెరారివాలన్‌కు సుప్రీం బెయిల్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook