TDP leaders in Gudivada, Casino issue : ఏపీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గమైన కృష్ణా జిల్లాలోని గుడివాడలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా కొడాలి కన్వెన్షన్‌ సెంటర్‌లో క్యాసినో నిర్వహించారనే ఆరోపణలు రావడంతో టీటీపీ (TDP) నిజనిర్ధారణ కమిటీ ఈరోజు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ శ్రేణుల రాక విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు, కార్యకర్తలు కన్వెన్షన్‌ సెంటర్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకుగాను భారీ గుడివాడలో ఎత్తున బందోబస్తు ఏర్పాటైంది. గుడివాడ ప్రధాన రహదారులంతటా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. 


రోప్‌పార్టీ పోలీసు టీమ్స్‌ కూడా రంగంలోకి దిగాయి. డీఎస్పీ సత్యానందం నేతృత్వంలో గుడివాడ నెహ్రూ చౌక్‌, అలాగే గుడివాడు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి. ఇక మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకుగాను మంత్రి కొడాలి నాని (Kodali Nani) అమరావతి వెళ్లారు. అయితే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఇప్పటికే గుడివాడకు చేరుకుంది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొందరు నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. 


క్యాసినో నిర్వహణపై టీడీపీ ముఖ్య నేతలు బొండా ఉమామహేశ్వరరావు, (Bonda Umamaheswara Rao) నక్కా ఆనందబాబు, వర్ల కొల్లు రవీంద్ర, రామయ్య, తంగిరాల సౌమ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో పాటు టీడీపీ శ్రేణులు గుడివాడ క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు గుడివాడకు వెళ్లారు.


Also Read : టీమిండియా మాజీ క్రికెటర్​​కు కరోనా.. రెండు సంవత్సరాలుగా తప్పించుకున్నా..!!


ఇక సొంత కన్వెన్షన్‌ సెంటర్‌లో మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహించారంటూ టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్‌ టు వైఎస్సార్‌ పేరిట క్యాసినో నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. కొడాలి నాని సొంత కన్వెన్షన్‌ సెంటర్‌లో గోవా సంస్కృతిని ప్రవేశపెట్టారని బొండా ఉమా అన్నారు. కొడాలి నానిని (Kodali Nani) మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలన్నారు.


Also Read : Jai bhim oscar: ఆస్కార్​ రేసులో సూర్య 'జై భీమ్'​ సినిమా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook