Jai bhim oscar: ఆస్కార్​ రేసులో సూర్య 'జై భీమ్'​ సినిమా!

Jai bhim oscar: ఆస్కార్​ ఎంట్రీకి అర్హత సాధించిన విదేశీ సినిమాల జాబితాలో.. 'జై భీమ్​'కు చోటు దక్కింది. ఆస్కార్స్ నామినేషన్స్ జనవరి 27- ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 03:33 PM IST
  • జై భీమ్​ సినిమా మరో ఘనత
  • ఆస్కార్​ ఎంట్రీకి అర్హత
  • నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా
Jai bhim oscar: ఆస్కార్​ రేసులో సూర్య 'జై భీమ్'​ సినిమా!

Jai bhim oscar: తమిళ హీరో సూర్య నటించిన జై భీమ్​ సినిమా మరో ఘతను సాధించింది. ఆస్కార్​ ఎంట్రీకి అర్హతను సాధించిన విదేశీ సినిమాల జాబితాలో జై భీమ్​ కూడా చోటు (Jai Bhim eligibility for Oscars entry) సంపాధించింది. ఈ విషయాన్ని 'ది అకాడమి ఆఫ్ మోషన్ పిక్చర్​ ఆర్ట్స్​ అండ్ సైన్స్​​' గురువారం ప్రకటించింది.

94వ ఆస్కార్ ఈవెంట్​ కోసం.. 276 విదేశీ సినిమాలు అర్హత సాధించగా.. అందులో జై భీమ్​ కూడా చేరినట్లు (Oscars race movies list 2022) పేర్కొంది.

జనవరి 18న..  ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్​లో సిన్​ ఆఫ్​ ది అకాడమిలో జై భీమ్​ వీడియోను పబ్లీష్ (Jai Bhim video in Oscar Youtube Channel)​ చేసింది. భారతతీయ సినిమాకు ఇది కూడా ఓ గొప్ప గౌరవం అంటున్నారు సినీ విశ్లేషకులు.

1993లో తమిళనాడులో జరిగిన.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసీన 'జై భీమ్​' సినిమా.. నేరుగా ఓటీటీలో విడుదలై.. విమర్శకుల ప్రశంసలు (Jai Bhim Story) అందుకుంది.

ఈ సినిమాలో హీరో సూర్య చంద్రు అనే న్యాయవాధిగా కనిపించారు. గిరిజనుల తరఫున న్యాయపోరాటం చేసే.. లాయర్​గా ఆయన నటనకు సినీ అభిమానులను ఎంతగానో (Suriya Jai Bhim in Oscars 2022 race) ఆకట్టుకుంది.

ఈ సినిమా విడుదలకు ముందు, విడుదలైన తర్వాత కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకతను, తమను కించపరిచేలా సన్నివేశాలున్నాయనే ఆరోపణలను ఎదుర్కొంది. అయినప్పటికీ సినిమా మాత్రం దాదాపు అన్ని వర్గాల ప్రశంసలు పొందట విశేషం. ఈ సినిమాను సూర్య, ఆయన భార్య జ్యోతిక స్వయంగా (Suriya Jai Bhim Film latest news) నిర్మించారు.

'జాకీ,' 'క్రూయెల్లా', 'డూన్', 'ఏజ్‌లెస్ లవ్', 'బ్లాక్ విడో', 'బూగీ', 'క్యాండీమాన్', 'ఎటర్నల్స్', 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్', 'కింగ్ రిచర్డ్', వంటి ఇతర చిత్రాలతో జై భీమ్' సినిమా పోటీ పడుతోంది.

ఆస్కార్స్ నామినేషన్స్ జనవరి 27- ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి. నామినేషన్స్​ను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు (Oscars 2022 Updates) న్యాయ నిర్ణేతలు.

Also read: సినీ ఇండస్ట్రీలో విషాదం.. కేజీఎఫ్ హీరో యష్ ఫేవరెట్ డైరెక్టర్ కన్నుమూత..

Also read: Akhanda OTT streaming: నేటి నుంచి ఓటీటీలో అఖండ మూవీ స్ట్రీమింగ్-​ పూర్తి వివరాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News