Minor girl Rape and murder case: మూడేళ్ల బాలికపై హత్యాచారం.. తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన చంద్రబాబు.. కీలక ఆదేశాలు..
Tirupati minor rape and murder: తిరుపతిలో ఇటీవల మైనర్ బాలికపై జరిగిన హత్యచారం ఘటన ఏపీలో పెనుదుమారంగా మారింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Minor Girl Raped and Murder incident in Tirupati: ప్రభుత్వాలు ఎన్ని కఠినచట్టాలు తీసుకొచ్చిన కూడా కొంతమంది కామాంధులు మాత్రం మారడంలేదు. ప్రతిరోజు కూడా మహిళలు వేధింపులకు చెందిన అనేక ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. పోక్సో, దిశ, అభయ, నిర్భయ వంటి చట్టాలు తీసుకొచ్చిన కూడా కేటుగాళ్లు మారడం లేదు. ఆడది కన్పిస్తే చాలు పశువుల్లా మారిపోతున్నారు. పసిపాప నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎవర్ని వదలడం లేదు.
ప్రతిరోజు మహిళలపై లైంగిక దాడులకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఇల్లుదాటి బైటకు వెళ్లిన మహిళ.. తిరిగి సెఫ్టీగా ఇంటికి వచ్చేవరకు ప్రస్తుతం టెన్షన్ గా మారిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఏపీలోని తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు.
పూర్తి వివరాలు..
తిరుపతి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వడమాల మండలం ఎఎంపురం గ్రామంలో సభ్య సమాజం ఉలిక్కి పడే ఘటన చోటు చేసుకుంది. అభం శుభం ఎరుగని చిన్నారిని.. చాక్లెట్ ఆశ చూపి ఒక కామాంధుడు ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత మార్చినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. బాలిక శవాన్ని పూడ్చివేసినట్లు సమాచారం. ఈ ఘటన వెలుగులోకి రావడంలో ఏపీలో ఒక్కసారిగా పెనుదుమారంగా మారింది.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా.. దీనిపై తాజాగా, చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనపై తీవ్రంగా పరిగణించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు. అంతే కాకుండా.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి వెంటనే కఠిన శిక్షపడేలా చూడాలన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ గా స్పందించారు.
Read more: YS Vijayamma: విజయమ్మ హత్యకు వైఎస్ జగన్ కుట్ర? మరో బాంబు పేల్చిన తెలుగుదేశం పార్టీ
మైనర్ బాలిక కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని తిరుపతి కలెక్టర్ ను ఆదేశించినట్లు తెలుస్తొంది. మరోవైపు దీనిపై హోమంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. ఘటన తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారన్నారు. అదే విధంగా రేపు ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు వంగల పూడి అనిత వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook