Nandyal Circle Inspector: సినిమాలలో, సమాజంలో ఏదైనా దొంగతనం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. విచారణ జరిపి అసలు దొంగను కోర్టులో ప్రవేశ పెట్టడం ఆనవాయితీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవేళ పోలీస్ ఉన్నత అధికారులకు తెలియకుండా దొంగతనం చేసి పరార్ అయితే.. ఇలాంటి సంఘటనలు సినిమాలో బాగుంటాయి కదా.. కానీ ఇలాంటి ఘటనే ఒకటి మన కర్నూలు జిల్లాలలో జరిగింది. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసే.. సొమ్ము కాజేసి పరారీలో ఉన్నాడు. ఆ పోలీసులను పట్టుకోటానికి జిల్లా ఎస్పీ స్పెషల్‌ టీంలను ఏర్పాటు చేసిన వైనం మన తెలుగు రాష్ట్రంలో చోటు చేసుకుంది. 


విషయానికొస్తే.. ఈ నెల 19వ తేదీన స్పెషల్‌ ఎన్‌పోర్స్‌ మెంట్‌ బ్యూరో అధికారులు కర్నూలులో దాడులు చేశారు. తమిళనాడుకు చెందిన సతీశ్‌ బాలకృష్ణన్‌ అనే వ్యక్తి నుంచి 75 లక్షలు సీజ్‌ చేశారు. అనంతరం కేసును కర్నూలు లోకల్‌ పీఎస్‌ కు అప్పగించారు. ఒకేసారి 75 లక్షల నగదును చూసేసరికి కర్నూలు సీఐ కంబగిరి రాముడికి అత్యాశ పెరిగింది. సీజ్‌ చేసిన నగదులో ఎంతో కొంత నొక్కాలని చూశాడు. తనకు అని చెప్తే బాధితుడు అంత మొత్తంలో ఇవ్వలేడు కాబట్టి ఉన్నతాధికారుల పేరును వాడుకున్నాడు. 


జిల్లా ఎస్పీకి ఇవ్వాలని సీఐ రాముడు 15 లక్షలు తీసుకున్నాడు. అనుమానం వచ్చిన సతీశ్‌ బాలకృష్ణన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు . ఇంటర్నల్‌ విచారణ లో.. సీఐ రాముడిది తప్పు ఉందని తేలింది. దీంతో సీఐ, ఎస్ఐతో పాటు ముగ్గురిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించాడు. విషయం తెలుసుకున్న సీఐ రాముడు.. కర్నూల్‌ నుంచి పరారీ అయ్యాడు. అతని అరెస్టు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.


Also Read: RRR Movie: ఏఎంబీ మాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్ షో.. సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్..!!


Also Read: MS Dhoni: ప్రపంచకప్ ట్రోఫీతో వచ్చాడు.. ఐపీఎల్ టైటిల్‌తో ముగించాడు! కెప్టెన్‌గా ముగిస్తే బాగుండు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook