Nara Lokesh Antahkarana Shuddhi: ఆంధ్రప్రదేశ్‌లో అట్టహాసంగా ప్రమాణస్వీకారం ముగియడంతో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ప్రమాణస్వీకారంలో అందరి దృష్టి నారా లోకేశ్‌పై పడింది. మంత్రిగా ప్రమాణం చేసే సమయంలో లోకేశ్‌ ఎలా చదువుతాడా? అని అందరూ ఆసక్తిగా గమనించారు. ఊహించినట్టుగానే లోకేశ్‌ ప్రమాణ పత్రాన్ని తప్పుగా చదివారు. ముఖ్యంగా అంతఃకరణ శుద్ధి సమయంలో లోకేశ్‌ తప్పుగా చదవడంతో నెటిజన్ల ట్రోల్‌కు దొరికాడు. లోకేశ్‌ పర్వాలేదు రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాశ్‌ అయితే మొత్తం తప్పులే చదివారు. ప్రమాణ పత్రం సక్రమంగా చేయలేని వారు పాలన ఎలా అందిస్తారని ప్రశ్నిస్తున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Amit Shah Tamilisai: మాజీ గవర్నర్‌ తమిళిసైకి అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్‌.. అతడి విషయంపైనేనా?


అయితే ముఖ్యమంత్రి తనయుడు కావడం.. టీడీపీ కీలక నాయకుడు నారా లోకేశ్‌ కావడంతో అతడిపైనే ట్రోలర్స్‌ ఎగబడ్డారు. లోకేశ్‌ ప్రమాణం 'భరత్‌ అనే నేను' సినిమాను గుర్తు చేస్తోంది. దీంతో అందరూ ఆ సినిమాతో లోకేశ్‌ను పోల్చి చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన మంగళగిరిలోనే ఈసారి భారీ మెజార్టీతో లోకేశ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోసారి తన తండ్రి మంత్రివర్గంలో భాగమయ్యాడు.

Also read: Pawan Chiranjeevi: సభపై భావోద్వేగానికి లోనైన పవన్‌ కల్యాణ్.. చిరంజీవికి పాదాభివందనం


గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో బుధవారం ప్రమాణస్వీకారం ఆర్బాటంగా జరిగింది. మొదట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం నారా లోకేశ్‌తో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. దైవ సాక్షిగా ప్రమాణం చేసిన లోకేశ్ ప్రమాణ పత్రంలో ముఖ్యమైన పదాన్ని తప్పుగా పలికారు. 'అంతఃకరణ శుద్ధి' అనే పదాన్ని తప్పుగా ఉచ్చరించారు. 'అంతర్గత శుద్ధి' అని పలికాడు.


ఇక ప్రమాణ పత్రంలో పలకాల్సిన వాటికి ఒత్తి పలుకుతూ ప్రమాణం చేశాడు. ఇక వాసంశెట్టి సుభాశ్‌ అయితే పూర్తిగా తప్పు చదివారు. సార్వభౌమత్వాన్ని.. సార్వబౌమానికాన్ని అని పలికారు. పక్షపాతం అనే పదాన్ని పాక్షకపాతం అని తడబడి తర్వాత సరిగ్గా చదివారు. ఏ వ్యక్తిని.. వ్యక్తులను తెలియపర్చ అనే పదం విషయంలో తడబడ్డారు. ఇలా తప్పుల తడకగా చదవడంతో ప్రజలు వారి తీరుపై మండిపడుతున్నారు. చదవడానికి రాని వారు ఇక మంత్రులుగా ఏం విజయవంతమవుతారని ప్రశ్నిస్తున్నారు.








స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter