New districts in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ( AP new districts ) ఏర్పడుతున్నాయి. ఈ దిశగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కో జిల్లాగా ప్రకటించేందుకు వైఎస్ జగన్ ( YS Jagan ) ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ముందుకెళ్తున్న వైఎస్ జగన్ సర్కార్ ( AP CM YS Jagan ) ఇప్పుడు జిల్లాల సంఖ్యను పెంచేందుకు యోచిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా అధికారులతో పలు దఫాల్లో చర్చలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉన్నాయి. ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్లమెంట్ నియోజవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఒక్కొక్క లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేయడానికి ( Each loksabha constituency as a district ) ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీని ప్రకారం రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 13 నుంచి 25కు పెరగనుంది. ( Also read: Nimmagadda Ramesh Kumar: బీజేపీ నేతలతో నిమ్మగడ్డ భేటీ వీడియో వైరల్.. రంగంలోకి దిగిన బీజేపి )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ నిర్ణయం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy ) కొత్త జిల్లాల సాధ్యాసాధ్యాలపై, అదనపు భారంపై పలు దఫాలుగా చర్చించారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్టణంతో పాటు అదనంగా అనకాపల్లి, అరకు జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లా మూడుగా చీలి... రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలుగా ఏర్పడనుంది. పశ్చిమగోదావరి జిల్లా రెండుగా చీలి... ఏలూరు, నర్సాపురం జిల్లాలుగానూ, కృష్ణా జిల్లా నుంచి విజయవాడ, మచిలీపట్నం జిల్లాలు, గుంటూరు నుంచి అదనంగా బాపట్ల, నర్సారావుపేట జిల్లాలు, చిత్తూరు నుంచి అదనంగా తిరుపతి, కడప నుంచి అదనంగా రాజంపేట, కర్నూలు నుంచి అదనంగా నంధ్యాల, అనంతపురం నుంచి అదనంగా హిందూపురం జిల్లాలు ఏర్పడనున్నాయి. 


శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో ఉన్న గిరిజిన ప్రాంతాల్ని కలుపుతూ ఏర్పడనున్న అరకు నియోజకవర్గాన్ని ట్రైబల్ జిల్లాగా ఏర్పర్చడానికి రంగం సిద్ధమవుతోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..