Perni Nani explanation on Chandrababu's allegations: శాసనసభలో తన సతీమణిని వ్యక్తిగతంగా దూషించారని.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కన్నీటి (Chandrababu Naidu cried) పర్యంతమైన నేపథ్యంలో ఈ విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనియాంశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనిపై రాజకీయ ప్రముఖులు.. స్పందిస్తూ వ్యక్తి గత దూషణను తప్పుబడుతున్నారు. చంద్రబాబు నాయుడి మనస్తాపానికి కారణమైన వారిపై మండిపడుతున్నారు. దీనిపై నందమూరి కుటుంబ సభ్యులు ప్రెస్​మీట్​ పెట్టి.. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. శాసనసభలో జరిగిన పరిణామాలపై ఏపీ మంత్రి పేర్ని నాని (Perni Nani over CBN) వివరణ ఇచ్చారు. అసలు చంద్రబాబు నాయుడు సతీమణిని వ్యక్తగతంగా ఎవరూ దూషించలేదని వెల్లడించారు.


అనవసర రాద్దాంతం చేసింది చంద్రబాబేనని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు తన అనుభవాన్నంతా ఉపయోగించి మెలో డ్రామా క్రియేట్ చేశారని విమర్శంచారు. తన సతీమణి పేరును ప్రస్తావించినట్లుగా.. చంద్రబాబు చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.


Also read: ఖబడ్దార్... విర్రవీగితే మెడలు వంచుతాం... వైసీపీ నేతలకు నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్...


Also read: ఏపీలో విషాదం: కూలిన రెండు భవనాలు...ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి..


ఆధారాలుంటే బయటపెట్టాలి..


అసలు చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు ఎమన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. ఏవైనా ఆధారాలుంటే బయటపెట్టాలని చెప్పారు.


అసెంబ్లీలో సెల్​ఫోన్లతో చిత్రీకరించకూడదని.. అయినా టీడీపీ నేతలు వీడియోలు తీసి అందరికీ పంపారని పేర్ని నాని ఆరోపించారు. అయితే ఆ వీడియోలో కూడా ఎక్కడ దూషణల గురించి చంద్రబాబు ప్రస్తావించలేదని పేర్కొన్నారు.


అనని మాటలను, జరగని విషయాలను చెడుగా చిత్రీకరించి.. రాజకీయంగా వాడుకోవడం దురృష్టకరమన్నారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని హితవు పలికారు. అసత్యాలు, నిందా పూర్వక ధోరణితో చంద్రబాబు కొత్త సంప్రదాయనికి తెరతీశారన్నారు.


Also read: నారా భువనేశ్వరికి పురంధేశ్వరి సంఘీభావం... నైతిక విలువల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని...


బాలకృష్ణ ఏది చెప్పనా నమ్మేస్తారు..


చంద్రబాబు ఏది చెబితే అది నిజమని బాలకృష్ణ నమ్ముతారని పేర్ని నాని పేర్కొన్నారు. ఆయన అమాయకపు చక్రవర్తి అన్నారు. అందరి ఇళ్లల్లో ఆడవాళ్లు ఉన్నారని.. అలాంటిది తామెందుకు ఆడవాళ్లను దూషిస్తామని స్పష్టం చేశారు.


Also read: వైసీపీలో విషాదం... గుండెపోటుతో ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం...


Also read: చంద్రబాబు కంటతడి పెట్టడం బాధించిందన్న పవన్ కల్యాణ్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook