AP: ఆ అధికారి విచారణలో నాట్ బి ఫోర్ మి
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిఘా పరికరాల కొనుగోలుకేసులో సస్పెండైన ఈ కేసు విచారణలో ఇప్పుడు నాట్ బిఫోర్ మి అంశం తెరపైకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ( Intelligence chief A B Venkateswara rao ) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిఘా పరికరాల కొనుగోలుకేసులో సస్పెండైన ఈ కేసు విచారణలో ఇప్పుడు నాట్ బిఫోర్ మి అంశం తెరపైకొచ్చింది.
నాట్ బిఫోర్ మి ( Not before me ) . ఇటీవలికాలంలో ప్రాచుర్యమైన జ్యుడీషియల్ వర్డ్ ఇది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం ( Ap Government ) సస్పెండ్ చేసింది. అయితే దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో..హైకోర్టు ( High court ) సస్పెన్షన్ ఉత్తర్వుల్ని కొట్టివేస్తూ ఆదేశాలిచ్చింది. దాంతో హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ..ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ( Supreme court ) ను ఆశ్రయించింది. ఈ కేసులో ఇప్పుడు కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ చేస్తున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆయన నాట్ బిఫోర్ మి అని అన్నారు. వ్యక్తిగత కారణాలతో కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. తాజా పరిణామంతో శీతాకాలం సెలవుల తర్వాతే ఈ కేసు మరో ధర్మాసనం ముందు విచారణకు రానుంది.
ద్రోన్ల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయనేది ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న ప్రధాన ఆరోపణ. సస్పెండ్ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)కు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.