YS Jagan Photo On Pawan Kalyan Land Papers: గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భూమి కొంటే ప్రభుత్వం ఇచ్చిన ధ్రువపత్రాలపై వైఎస్‌ జగన్‌ ఫొటో నవ్వుతూ ఉందని పేర్కొన్నారు. ఎందుకు ఇంతలా ప్రచార పిచ్చి ఉందని పేర్కొన్నారు. వరదలకు జగన్‌ ప్రకటించిన రూ.కోటి విరాళం ఎక్కడికి పోయిందని సందేహం వ్యక్తం చేశారు. ఏపీలోని మంగళగిరిలో బుధవారం జరిగిన ఎన్డీయే శాసనపక్ష సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu House: చట్టానికి చంద్రబాబు చుట్టం కాదు.. ఆయన ఇల్లు కూల్చివేయాల్సిందే!


ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడును ప్రశంసలతో ఆకాశానికెత్తారు. 'వంద రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాం. ఆర్థిక శాఖలో డబ్బులు లేకున్నా.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లు పెంచాం. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించాం. నిర్జీవమవుతున్న పంచాయతీలకు సీఎం చంద్రబాబు రూ.1,452 కోట్లు ఇచ్చారు' అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

Also Read: YS Viveka Murder Case: వైఎస్ జగన్ చెల్లెలు సంచలనం.. సీఎం చంద్రబాబుతో భేటీ


క్యాంటీన్లు ఎలా కూల్చారు?
ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ అన్న క్యాంటీన్లపై పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పేదలు, కార్మికుల క్షుద్బధ తీరుస్తున్న అన్న క్యాంటీన్లను ఎలా మూసివేయాలనిపించింది' అని సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విజయవాడ వరదల్లో చంద్రబాబు చేసిన సహాయ కార్యక్రమాలను పవన్‌ గుర్తు చేశారు. 'సీఎం చంద్రబాబు ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తోంది. పాతికేళ్ల యువకుడు కూడా చంద్రబాబులా కష్టపడలేరు. సీఎం బురదలో దిగి నడుస్తుంటే కూడా వైఎస్సార్‌సీపీ విమర్శలు చేస్తోంది. ఆయన చేసే మంచి పనులను గుర్తించి అండగా ఉంటాం' అని స్పష్టం చేశారు.


జగన్ బొమ్మ
గత ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై ఈ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను పిఠాపురంలో భూములు కొన్నా. కొన్న తర్వాత వచ్చిన పత్రాలు చూస్తే వాటిపై వైఎస్‌ జగన్‌ నవ్వుతూ ఉన్న బొమ్మ కనిపించింది. నాకే ఆశ్చర్యమేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజముద్రను తొలగించి ఆయన ఫొటో వేసుకున్నారు' అని తెలిపారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను రక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం సవ్యంగా నడుస్తోంది.. మూడు పార్టీల ఆత్మ ఒకటేనని పేర్కొన్నారు. 'మూడు విభిన్న పార్టీలు అయినప్పటికీ ఆత్మ ఒక్కటే. మూడు పార్టీల గుండెచప్పుడు ఒక్కటే' అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook