Pawan Kalyan: పవన్‌కు ఏదైనా ప్రమాదం పొంచి ఉందా..? అందుకే హోంశాఖ కావాలంటున్నారా..?
Pawan Kalyan : పిఠాపురంలో పవన్ మాట్లాడిన దానిలో మరో కోణం ఉందా...పవన్ కు తనకు ఏదైనా పర్సనల్ థ్రెట్ ఉందనే సమాచారం వచ్చిందా..?అన్నీ తెలిసి కూడా ఇంటెలిజెన్స్ చూసీ చూడనట్లుగా ఉంటుందని పవన్ భావిస్తున్నారా..? హోంశాఖ విఫలమైందని అనడానికి కారణం అదేనా..? ఎప్పుడూ లేనిది పోలీసులపై పవన్ అంతలా సీరియస్ అందుకే అయ్యారా..? పవన్ కు హానీ కలిగించేలా ఎవరైనా కుట్రకు ప్లాన్ చేస్తున్నారా..? అందుకే పవన్ అంతలా రియాక్ట్ అయ్యారా..?
Pawan Kalyan :పవన్ కళ్యాణ్ ..సినిమాల్లో ఐనా, రాజకీయాల్లో ఐనా పవన్ కళ్యాణ్ దీ తీరే వేరు. టాలీవుడ్ లో ఎంత మంది హీరోలొచ్చినా ఆయన అభిమానం మాత్రం చెక్కు చెదరదు. అదే సమయంలో రాజకీయాల్లో ఎంత పెద్ద లీడర్ ఉన్నా పవన్ ఛరిష్మానే వేరు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో అటు పాలిటిక్స్ లో ఫాలోయింగ్ అంతా కాదు. ఈ తరంలో ఎవరికీ లేనంత పెద్ద ప్యాన్ ఫాలోయింగ్ పవన్ సొంతం. పవన్ కు సినిమాలతో పాటు సామాజిక దృక్పథం కూడా ఎక్కువే. సమాజానికి ఏదో చెయ్యాలని పరితపిస్తుంటారు.అంతే కాదు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రతి నిత్యం ప్రశ్నిస్తుంటూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీటిపై ఆవేశపూరితంగా కూడా రియాక్ట్ అవుతారు. నిజంగా చెప్పాలంటే పవన్ లో ఆ అటిట్యూడే ఇంత పెద్ద ఫాలోయింగ్ ఏర్పడటానికి కారణంగా చెప్పవచ్చు.
అలాంటి పవన్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాక కూడా తన పంథాను మార్చుకోలేదు. జనసేన పార్టీనీ ఏర్పాటు చేసి ఏపీలో జరుగుతున్న అన్యాయాలను జనసేనాని నిలదీయడం మొదలు పెట్టాడు. కొన్ని రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా ఏర్పడుతాయి. కానీ జనసేన మాత్రం ప్రశ్నించడం కోసమే ఏర్పడిందని పవన్ చెబుతుంటారు. నిజంగా పవన్ ఏనాడు అధికారం కోసం తాపత్రయం పడలేదని జనసైనికులు చెబతుంటారు. అలాంటి జనసేన క్రమక్రమంగా రాజకీయంగా బలపడుతూ ప్రస్తుతం ఏపీలో అధికార కూటమిలో భాగస్వామ్యంగా మారింది. గత ఎన్నికల్లో వందకు వంద శాతం స్ట్రైక్ రేటుతో విక్టరీ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించారు జనసేనాని.
ఏపీలో అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం ఎంతో చేయాలనేది పవన్ అభిమతం కానీ ఎక్కడో ఏదో తెలియని గ్యాప్ ఉందనేది జనసేన అంతర్గం వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చాము వాటిని తూచ తప్పకుండా అమలు చేయాలనేది పవన్ ఆలోచన. అందులో ముఖ్యంగా ఏపీలోని శాంతి భధ్రతల సమస్యలను పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఏపీలో లా అండ్ అర్డర్ దారుణంగా ఉందని దానిని సరి చేయాలనేది పవన్ భావన. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో జరుగుతున్న రేప్ ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయనేది పవన్ ఆవేదన.
ఇది ఇలా ఉండగానే..డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల కొన్ని అధికారికి కార్యక్రమాలు ఉన్నట్లుండి రద్దయ్యాయి. దానికి కారణాలేంటో మాత్రం తెలియరాలేదు. పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో ఇష్టానురీతిగా అసభ్యకరంగా పోస్టులు పెట్టినా పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.అంతేకాదు పవన్ కళ్యాణ్ భధ్రత విషయంలో కూడా జనసూన ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పవన్ సనాతన ధర్మం మీద సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కామెంట్స్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. దీంతో పవన్ కు ఎవరి వల్లనైనా ప్రమాదం ఉండే అవకాశం లేకపోలేదు అని జనసేన పార్టీ అనకుంటుందంట.
ఏపీలో ఇంత జరుగుతున్నా పో్లీసులు కానీ, హోం శాఖ కానీ అస్సలు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే పవన్ అలా సీరియస్ అయ్యారని పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే హోం మంత్రి అనిత, డీజీపీతో పాటు పోలీసులపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని సమాచారం.అంతే కాదు ఏపీలో రోజు వారీ రాజకీయ, ఇతర అంశాలకు సంబందించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పవన్ కు సమాచారం ఉండడం లేదంట. ఇది పవన్ ను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుదనేది జనసేన వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వంలో జనసేనది కీలక పాత్ర.అందునా పవన్ డిప్యూటీ సీఎం. సీఎం వద్ద ఉన్న సమాచారం పవన్ దగ్గర కూడా ఉంటే తప్పేందనేది జనసైనికులు మాట. అంతే కాదు ప్రభుత్వంలో పవన్ ది నెంబర్ టు . కానీ పవన్ దగ్గర లేని నిఘా సమాచారం మంత్రి లోకేశ్ దగ్గర ఉంటుండడంతో పవన్ కొంత అసంతృప్తిగా ఉన్నారట.
అందుకే పిఠాపురంలో పవన్ హోంశాఖను తానే చేపడుతానని అన్నారని వారు చెబుతున్నారు. హోంశాఖ చేతిలో ఉంటే రోజువారీ ఇంటెలిజెన్స్ సమాచారం అందుబాటులో ఉంటుంది. తమ పార్టీపై జరుగుతున్న రాజకీయ కుట్రలను కూడా తెలసుకునే అవకాశం ఉందని పవన్ అనుకుంటున్నారట.పవన్ డిప్యూటీ సీఎం హోదాలో హోంశాఖ మంత్రిగా ఉంటే బాగుంటుందనే ఢిల్లీ పెద్దలు కూడా అనుకుంటున్నారట. హోం శాఖ తీసుకోమని ఢిల్లీ హైకమాండ్ కూడా సూచిస్తున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కూడా హోంశాఖను తీసుకోవాలని బలంగా అనుకుంటున్నారట. అందుకే పిఠాపురంలో అలా మాట్లాడరని టాక్. మొత్తానికి హోంశాఖపై పవన్ చేసిన కామెంట్స్ యాదృశ్చికంగా చేసినవి కావనీ..దీని వెనుక పెద్ద కథే ఉందనేది జనసేనలో జరుగుతున్న చర్చ.
మరి అందరూ అనుకుంటునట్లే పవన్ హోంశాఖ తీసుకోవడం ఖాయమేనా..హోంశాఖను పవన్ కు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకుంటారా..అలా జరిగితే ఏపీలో ఎలాంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈ పరిణామాలన్నింటికి పులిస్టాప్ పడాలంటే చంద్రబాబు, పవన్ హోంశాఖపై ఏదో ఒక ప్రకటన చేయాల్సి ఉందనేది కూటమి అభిప్రాయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.