ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు గిఫ్ట్ ఏంటో తెలుసా. రాష్ట్ర ప్రజలకు మరో సరికొత్త పథకం ఆ రోజు ప్రారంభం కాబోతుంది. సర్వే పూర్తయితే మీకూ ఆ పథకం వర్తిస్తుంది మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


డిసెంబర్ 21 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు ( ap cm ys jagan birthday ). ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజల కోసం మరో సరికొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకాన్ని డిసెంబర్ 21న ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పధకంపై వైెఎస్ జగన్ ( ap cm ys jagan ) అధికార్లతో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా భారీగా సర్వే నిర్వహిస్తారు. ఇందులో గ్రామాలు, నివాసాలు, పట్టణ, నగరాలతో కలిపి దాదాపుగా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే ఉంటుంది. 


రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల 460 గ్రామాల్లో ఈ సర్వే ( Land survey ) ఉంటుంది. తొలి విడతలో 5 వేలు, రెండో విడతలో 6 వేల 5 వందలు, మూడో విడతలో 5 వేల 5 వందల గ్రామాల్లో సర్వే జరగనుంది. అటు పట్టణాలు, నగరాల్లో అయితే 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే నిర్వహించనున్నారు. 10 లక్షల ఓపెన్ ప్లాట్లు, 40 లక్షల అసెస్ మెంట్ భూముల్లోనూ సర్వే జరుగుతుంది. రాష్ట్రంలో 90 లక్షల మంది పట్టాదారులకు చెందిన 2.26 కోట్ల ఎకరాల భూములు కూడా సర్వేలో వస్తాయి.


ఒకసారి సర్వే పూర్తయిన తరువాత ల్యాండ్ టైటిలింగ్ కార్డు ఇస్తుంది ప్రభుత్వం. ఈ కార్డులో యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ( Unique identification number ) తో పాటు ప్రాపర్టీ కొలతలు, ఏరియా, యజమాని పేరు, ఫోటో ఉంటుంది. క్యూ ఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ అన్ని వివరాలు మ్యాప్ లో కూడా ఉండేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏమైనా వివాదాలుంటే వాటిని నమోదు చేసుకుంటారు.  


ప్రజల వ్యక్తిగత ఆస్థుల రక్షణ కోసం ఈ సమగ్ర పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. Also read: Eluru mystery Disease: ఏలూరు వింత వ్యాధికి కారణం తెలిసింది..వింటే ఆశ్చర్యపోతారు..