Pawan Kalyan Contest: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌  తాను పోటీ చేస్తానని ప్రకటించిన పిఠాపురం నియోజకవర్గంలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉమ్మడి అభ్యర్థిగా పవన్‌ పోటీలోకి నిలబడడం తీవ్ర దుమారం రేపింది.  పవన్‌కల్యాణ్‌ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌పై మండిపడ్డారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక నియోజకవర్గ నాయకుడు ఎన్‌వీఎస్‌ఎన్‌ వర్మ అనుచరులు పవన్‌ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan Kalyan: రక్తంతో నిండిన బట్టలతో పవన్‌ కల్యాణ్‌.. ఎందుకు? ఏం జరిగింది?


 


వర్మకు టికెట్‌ కేటాయించకుండా పవన్‌ పోటీ చేస్తుండడం పిఠాపురంలో కలకలం రేపింది. పార్టీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ మద్దతుదారులు నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయం వద్ద కరపత్రాలు, పార్టీ జెండాలు దహనం చేశారు. నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో అసభ్య పదజాలంతో దూషించారు. 'గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి ఓడిపోయిన పవన్‌కల్యాణ్‌ మళ్లీ అక్కడ పోటీ చేసి గెలవాలి. కానీ పిఠాపురం నుంచి పోటీ చేయడం సరికాదు. ఇక్కడ వర్మకు తప్ప వేరే ఏ అభ్యర్థిని ప్రకటించినా సహకరించం' అని టీడీపీ నాయకులు, వర్మ మద్దతుదారులు తేల్చిచెప్పారు.

Also Read: AP Alliance Seats: పవన్‌కు భారీ షాక్‌.. సీట్లు పంచుకున్న టీడీపీ, బీజేపీ.. జనసేనకు రెండు కోత


 


పిఠాపురం నుంచి పవన్‌కల్యాణ్‌ పోటీ విరమించుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్‌ చేశారు. పవన్‌ వైదొలగకపోతే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు. అసమ్మతి సెగలు, ఆగ్రహ జ్వాలలు చెలరేగడంతో మరి పవన్‌ వెనక్కి తగ్గుతారా? లేదో చూడాలి. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాల్లో జనసేన పార్టీకి కేవలం 21 స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. బీజేపీకి 10, టీడీపీకి 144 స్థానాలు దక్కాయి. ప్రస్తుతం అక్కడ వైఎస్సార్‌ సీపీ తరఫున పెండెం దొరబాబు పోటీలో ఉన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter