TDP BJP Janasena: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఏకమైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎట్టకేలకు పోటీ చేసే స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చాయి. రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల విషయమై సుదీర్ఘంగా చర్చించిన మూడు పార్టీల నాయకులు రాత్రి సీట్ల సంఖ్యపై ఏకాభిప్రాయానికి వచ్చి సీట్ల పంపకంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 6 లోక్‌సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. పొత్తు కుదరనప్పుడు ప్రకటించిన సీట్లలో జనసేన పార్టీకి కోత పడింది. అప్పుడు 23 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించగా తాజాగా జరిగిన చర్చల్లో రెండు సీట్లు కోత పడ్డాయి. 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలతో పవన్‌కల్యాణ్ సరిపెట్టుకున్నారు.
Also Read: Chungreng Koren: 'మణిపూర్ మంటల్లో కాలుతుంది మోదీజీ ఒక్కసారి రండి' కన్నీళ్లతో చాంపియన్ విజ్ఞప్తి
పార్టీ అసెంబ్లీ స్థానాలు లోక్‌సభ స్థానాలు
టీడీపీ 144 17
బీజేపీ 10 6
జనసేన 21 2
Also Read: CAA Implement: మోదీ ప్రభుత్వం సంచలనం.. ఎన్నికల వేళ సీఏఏ అమలుకు నిర్ణయం
ఢిల్లీలో బీజేపీతో పొత్తు కుదిరిన అనంతరం తొలిసారి మూడు పార్టీలు సమావేశమయ్యాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జనసేన తరఫున పవన్‌కల్యాణ్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బై జయంత్ చర్చలు జరిపారు. దాదాపు 8 గంటలకు పైగా చర్చలు జరిపిన అనంతరం రాత్రిపూట సీట్లపై అధికారిక ప్రకటన చేశారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సమావేశంలో నాయకులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయంతోపాటు ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశాలపై కూడా చర్చించారు.
వైఎస్ జగన్‌ను ఎలా ఎదుర్కొనాలో అనే అంశంపై కూడా చర్చ జరిగిందని సమాచారం. ఇక మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో ప్రచార వ్యూహంపై కూడా చర్చలోకి వచ్చిందని తెలిసింది. ఇక ఈనెల 18వ తేదీన నిర్వహించే తొలి బహిరంగ సభ ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ముగ్గురూ కలిసి ఆ వేదికపై కనిపించనున్నారు.
Also Read: PM Modi Tour: ఏపీలో మోదీ తొలి ఎన్నికల పర్యటన, విశాఖలో రోడ్ షో, చిలకలూరిపేటలో మీటింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter