విజయవాడ కోవిడ్ 19 సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంపై దేశం మొత్తం ఉలిక్కిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ..ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అటు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కోవిడ్ సెంటర్ లో  జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా అందర్నీ దిగ్భ్రాంతికి లోను చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాల్ని తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..సీఎం జగన్ తో ఫోన్ లో మాట్లాడారు. సంఘటన ఎలా జరిగిందనేది వైఎస్ జగన్ ప్రధానికి వివరించారు. నగరంలని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఓ హోటల్ ను లీజుకు తీసుకుని అందులో కరోనా రోగుల్ని ఉంచిందని...అందులో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిందని జగన్ వెల్లడించారు. అధికారులు అప్రమత్తమై సహాయకచర్యల్ని చేపట్టడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని...కొందరు మరణించారని మోదీకు జగన్ తెలిపారు. బాధితుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని...మృతులకు ఒక్కో కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించామన్నారు. 


మరోవైపు ఈ ప్రమాదంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. Also read: విజయవాడలో విషాదం: 11కి చేరిన మృతుల సంఖ్య