Polavaram Project: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నాయి. డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేసే దిశగా వడివడిగా పనులు సాగుతున్నాయి. కీలకమైన వరద నీరు మళ్లింపు ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు(Polavaram Project) ను డిసెంబర్ 2021 నాటికి పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం (Ap government) సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ పనులు చేపట్టింది. ప్రాజెక్టు పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన 42.5 మీటర్ల ఎత్తులో తలపెట్టిన కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ఏడాది స్పిల్ వే నుంచి 14 గేట్ల ద్వారా నీటి తరలింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు స్పిల్ వే ఛానెల్ పనులు పూర్తయ్యాయి.


మరోవైపు పోలవరం వరద నీరు మళ్లింపు ( Flood Water Divertion Works) పనుల్ని కూడా మొదలు పెట్టారు. సహజ సిద్ధంగా వెళ్తున్న గోదావరి నదిని అధికారులు మూసివేయడంతో వరద నీరు దిశ మారనుంది. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుంచి కుడి వైపుకు మళ్లిస్తున్నారు. పోలవరం స్పిల్ వే (spill way) నుంచి వర్షాకాలంలో వచ్చే వరదనీరును మళ్లించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే ఏడాది 14 గేట్ల ద్వారా ప్రాజెక్టు స్పిల్ వే నుంచి గోదావరి నదీ ప్రవాహాన్ని తరలించనున్నారు.


Also read: Krishnapatnam Medicine: ఆనందయ్య మందుకు శాస్త్రీయత కల్పించే చర్యలు, రేపట్నించి ప్రీ క్లినికల్ ట్రయల్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook