పది మంది కరోనా రోగుల ప్రాణాలు హరించిన విజయవాడ అగ్నిప్రమాద ఘటన ( Vijayawada Fire accident ) లో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే రమేష్ ఆసుపత్రి డాక్టర్  రమేష్ కోసం గాలిస్తున్న పోలీసులు ఇక స్వర్ణ ప్యాలేస్ యజమాని శ్రీనివాసరావు కోసం కూడా గాలింపు చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


విజయవాడలోని స్వర్ణ ప్యాలేస్ హోటల్ ను రమేష్ హాస్పటల్ ( Ramesh Hospital ) యాజమాన్యం లీజుకు తీసుకుని ప్రైవేట్ గా కోవిడ్ సెంటర్ ( Covid centre ) నడుపుతోంది. ఈ సెంటర్లో అగ్నిప్రమాదంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ( Ap Government ) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. హాస్పటల్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాధమికంగా భావించారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. అనంతరం హాస్పటల్ ఛైైర్మన్ డాక్టర్ రమేష్ ( Dr Ramesh ) కోసం ప్రయత్నించగా...అప్పటికే పరారయ్యారు. ఓ బృందం ఇప్పుడు డాక్టర్ రమేష్ కోసం గాలిస్తోంది. మరోవైపు స్వర్ణ ప్యాలేస్ ( Swarna palace ) యజమాని శ్రీనివాసరావు సైతం తాజాగా పరారైనట్టు తెలిసింది. దాంతో ఏసీపీ సూర్యచంద్రరావు నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యల్ని తీవ్రతరం చేశాయి. 


డాక్టర్ రమేష్ కుటుంబ సభ్యుల కాల్ డేటా ఆధారంగా రమేష్ ఎక్కడున్నారనేది విచారణ చేస్తున్నారు. కరోనా రోగులకు స్కాన్ చేసి..కరోనా లక్షణాలున్నాయని చెబుతూ రోగుల్నించి దోపిడీ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పుడన్ని కోణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాద స్థలానికి ఎఫ్ఎస్ఎల్  ( FSL ) రాష్ట్ర కమిటీ చేరుకుంది. పూర్తిగా వివరాలు సేకరించే పనిలో పడింది. Also read: Big Boss: సీజన్ 4 హోస్ట్ గా నాగార్జున పారితోషికం ఎంతో తెలుసా