Big Boss: సీజన్ 4 హోస్ట్ గా నాగార్జున పారితోషికం ఎంతో తెలుసా

బిగ్ బాస్ సీజన్ 4 ( BIg Boss Season 4 ) ప్రారంభానికి అంతా సిద్ధంగా ఉంది. ఆగస్టు నెలాఖరున షో ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. షో ఎప్పుడ ప్రారంభమైనా సరే...హోస్ట్ గా మరోసారి వ్యవహరించబోతున్న నాగార్జున ( Nagarjuna ) సీజన్ 4 కు తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా.

Last Updated : Aug 12, 2020, 07:25 PM IST
Big Boss: సీజన్ 4 హోస్ట్ గా నాగార్జున పారితోషికం ఎంతో తెలుసా

బిగ్ బాస్ సీజన్ 4 ( BIg Boss Season 4 ) ప్రారంభానికి అంతా సిద్ధంగా ఉంది. ఆగస్టు నెలాఖరున షో ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. షో ఎప్పుడ ప్రారంభమైనా సరే...హోస్ట్ గా మరోసారి వ్యవహరించబోతున్న నాగార్జున ( Nagarjuna ) సీజన్ 4 కు తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా.

ఇంచుమించు అన్ని భాషల్లో ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ కాంటెస్ట్ ( Big Boss contest ) కు తెలుగులో నాలుగో సీజన్ ప్రారంభం కావల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అన్నీ అనుకున్నట్టు పూర్తయితే ఆగస్టు 29 లేదా 30 తేదీల్లో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కోవిడ్ కారణంగా పనులు పూర్తిస్థాయిలో ముందుగు సాగడం లేదు. ఇప్పటికే సీజన్ 4 లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు ఫైనలైంది. షోలో మొత్తం 16 మంది పాల్గొననుండగా..మరోసారి హోస్ట్ గా నాగార్జునే ( Big Boss 4 host nagarjuna ) వ్యవహరించబోతున్నారు.  అదే విధంగా 106 రోజుల పాటు జరగనుంది.

తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ గా ఇప్పటికే అత్యధిక పారితోషికం తీసుకున్నది నాగార్జునే. సీజన్ 3కు నాగార్జున 3 నుంచి 3-5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలిసింది. సీజన్ 1 కు హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ 2.5 కోట్లు తీసుకోగా...సీజన్ 2 లో నాని 3 కోట్లు తీసుకున్నారు. సీజన్ 3లో ఎపిసోడ్ కు 12 లక్షల చొప్పున 15 వారాలు నడిచిన షోకు 5 కోట్ల వరకూ తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు సీజన్ 4 కు ఏకంగా 8 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కంటెస్టెంట్స్ అయితే వారివారి రేంజ్ ను బట్టి డిసైడ్ చేస్తుంటారు. Also read: Rain Alert: ఏపీలో నాలుగురోజుల పాటు భారీ వర్షాలు

Trending News