Polavaram Power Plant: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఘట్టం ఇవాళ ప్రారంభమైంది. పోలవరం విద్యుత్ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. పనుల టెండర్ దక్కించుకున్న మేఘా సంస్థ ప్రెషర్ టన్నెల్ తవ్వకం పనులు ప్రారంభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలవరం (Polavaram)ఓ బహుళార్ధ సాధక ప్రాజెక్టు. నీటి అవసరాలతో పాటు విద్యుత్ అవసరాల్ని పెద్దఎత్తున తీర్చగలిగేది. గోదావరి నదిపై మహారాష్ట్రలోని జైక్వాడ్ డ్యామ్ నుంచి దిగువన ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్(Dowlaiswaram Barrage)వరకూ అతిపెద్ద నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన ప్రాజెక్టు పోలవరం ఒక్కటే. అందుకే భారీ స్థాయిలో విద్యుత్ ప్లాంట్ (Polavaram Power Plant) నిర్మాణానికి చాలా అనువైనది ఈ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమైన జల విద్యుత్ కేంద్రం పనుల్ని దక్కించుకున్న మేఘా సంస్థ మార్చ్ 30వ తేదీన పనులు ప్రారంభించింది. అయితే కీలకమైన ఘట్టం మాత్రం ఇవాళే ప్రారంభమైంది. ప్రాజెక్టులో అత్యంత కీలకంగా భావించే 12 ప్రెషర్ టన్నెళ్ల తవ్వకం పనులు తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద ప్రారంభమయ్యాయి.ఇప్పటికే 18.90 లక్షల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులు పూర్తయ్యాయి. జల విద్యుత్ కేంద్రం పునాది పనుల్ని జల వనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 


పోలవరం ప్రాజెక్టు(Polavaram project)హెడ్ వర్క్స్‌లో ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌(Earth cum Rockfill dam)కు ఎడమవైపున జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్‌లో 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లతో 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా జల విద్యుత్ కేంద్రం నిర్మితమవుతోంది. పోలవరం ప్రాజెక్టు నీటిమట్టం 35.52 మీటర్ల ఎత్తు నుంచి నీటిని ప్రెషర్ టన్నెళ్ల ద్వారా పంపిస్తారు. టన్నెళ్లకు దిగువన కెప్లాన్ టర్బైన్లు ఉంటాయి. భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ సంస్థ ఈ వర్టికల్ టర్బైన్లను తయారు చేస్తోంది. పోలవరం విద్యుత్ కేంద్రంలో వినియోగించనున్న టర్బైన్లు ఆసియాలోనే అతి పెద్దవి కావడం గమనార్హం.


Also read: కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook