Ram Murthy Naidu: తమ్ముడి పార్థీవ దేహంతో సొంతూరికి ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు అంత్యక్రియలు..
Ram Murthy Naidu Last rites: నారా రామ్మూర్తి నాయుడు నిన్న శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడి అంత్యక్రియలు ఈరోజు నిర్వహించనున్నారు. హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి. అయితే, నేడు ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని ఏపీకి తరలించనున్నారు.
Ram Murthy Naidu Last rites: ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి అంత్యక్రియలు ఈరోజు వారి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని 'నారా వారి పల్లె' లో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించునున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని ఏపీకి తరలించనున్నారు.నారావారి పల్లెలోని సీఎం చంద్రబాబు నాయుడు తండ్రి కర్జూర నాయుడు, తల్లి అమ్మనమ్మ సమాధుల వద్ద రామ్మూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 72 ఏళ్ల ఈ నేత మృతిపై తీవ్ర సంతాపం తెలియజేసిన రాజకీయ నాయకులు ఆయన మృతదేహాన్ని నిన్నటి నుంచి సందర్శిస్తున్నారు. అయితే, నేడు ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఏపీలోని నారా వారి పల్లెకు తరలించనున్నారు.
నారా రామ్మూర్తి మూడు రోజుల కింద గుండె సంబంధిత సమస్యల వల్ల హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో నిన్న మధ్యాహ్నం 12:40 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.సోదరుడి మరణం జీర్ణించుకోలేక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రామ్మూర్తికి భార్య ఇందిరా, గిరీష్, రోహిత్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. రోహిత్ వివిధ తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఎమ్మెల్యేగా పనిచేసిన రామ్మూర్తి మరోసారి ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇదీ చదవండి: మణిపూర్‌లో మళ్లీ హింస.. మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి, ఇంటర్నెట్ బంద్ వీడియో వైరల్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న రామ్మూర్తి మృతిపై తీవ్ర ఆవేధన వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం వరకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఉన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. నేడు నారావారి పల్లెకు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. చంద్రబాబు నాయుడుతో కొంతకాలం ఆయనకు విభేదాలు ఉన్నాయి. ఆ తర్వాత అన్న చంద్రబాబుతో కలిసిపోయారు.
ఇదీ చదవండి: రైతులకు రేవంత్ సర్కార్ బంపర్ గుడ్‌న్యూస్.. అకౌంట్లలో బోనస్ డబ్బులు జమా, వెంటనే చెక్ చేసుకోండి..!
రామ్మూర్తి చంద్రగిరి నియోజక వర్గం నుంచి 1994-1999 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇదిలా ఉండగా తండ్రి మరణం జీర్ణించుకోలేక హీరో నారా రోహిత్ ఓ పోస్ట్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ హృదయాన్ని కలిచి వేస్తోంది. 'నువ్వు పెద్ద ఫైటర్‌వు నాన్న.. నాకు ఎలా గెలవాలో నేర్పించావు. జీవితాంతం నీ జ్ఞాపకాలతో బతికేస్తాను, బై నాన్న అంటూ నారా రోహిత్ చేసిన ట్వీట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈరోజు నేను ఈ పొజిషన్‌లో ఉన్నావంటే నువ్వే కారణం నాన్న' అని పోస్ట్ చేశారు. ఇటీవలె నారా రోహిత్ నిశ్చితార్థం కూడా వైభవంగా జరిగింది. ఈలోగా ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో నారా రోహిత్ పెళ్లి వాయిదా పడే అవకాశం ఉంది. నారా రోహిత్ 'సుందరాకాండ' అనే సినిమా విడుదలకు రెడీ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి