Ap Corona update: రాష్ట్రంలో గణనీయంగా తగ్గుతున్న కొత్త కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పూర్తిగా తగ్గుతున్నాయి. 20 రోజలుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అదే సమయంలో నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. కేసులు తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా వైరస్ కేసులు ( Coronavirus cases ) పూర్తిగా తగ్గుతున్నాయి. 20 రోజలుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అదే సమయంలో నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. కేసులు తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.
ఏపీ ( Ap ) లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ( Covid19 tests ) జరుగుతున్నాయి. గత 24 గంటల్లో 69 వేల 463 పరీక్షలు నిర్వహించగా.. కేవలం 3 వేల 892 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత నెలలో ఇదే సమయంలో 10-11 వేల కేసులు నమోదవుతుండేవి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 67 వేల 465కు చేరింది. కొత్తగా 28 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6 వేల 319కి చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో 5 వేల 50 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 67 లక్షల 72 వేల 273 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 41 వేల 669 మాత్రమే ఉండటం విశేషం.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే..గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లా ( East godavari district ) లో అత్యధికంగా 607 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 518, కృష్ణా జిల్లాలో 458 కేసులు, గుంటూరు జిల్లాలో 345 కేసులు బయటపడ్డాయి. చిత్తూరులో 405, కడపలో 332 కేసులు వెలుగుచూడగా...అనంతపురంలో 290, కర్నూలులో 104, నెల్లూరులో 219 కేసులు బయటపడ్డాయి. Also read: Ap High court: చంద్రబాబుకు ఆ పదవి ఇవ్వమంటూ ప్రభుత్వానికి ఆదేశాలు