Ratha Saptami 2022 in Telugu States: సూర్య జయంతి సందర్భంగా ఇవాళ అంతటా భక్తులంతా ఘనంగా రథసప్తమి వేడుకలను నిర్వహించుకున్నారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో రథసప్తమి అద్భుతం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నంద్యాలలోని (Nandyal) సంజీవనగర్ రామాలయం మొత్తం భానుడి కిరణాలతో ప్రకాశిస్తూ కనిపించింది. రథసప్తమి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు ఉంచిన దేవతా విగ్రహమూర్తులపై నేరుగా సూర్యకిరణాలు పడ్డాయి. 


అంతేకాదు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా భానుడి కిరణాలతో వెలిగిపోయాయి. ఆలయంలో అరుణ హోమం (Aruna Homam) నిర్వహిస్తుండగా ఇలా అరుణోదయ కిరణాలతో.. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ వెలిగిపోయాయి. 


సూర్య భగవానుడికి పూజలు చేస్తోన్న భక్తులంతా ఈ ఆశ్చర్యకరమైన ఘటన చూసి ఆనందం వ్యక్తం చేశారు. రథసప్తమి (Ratha Saptami) రోజున ఇలాంటి అరుదైన ఘటన జరగడం నిజంగా అదృష్టమంటూ భక్తులు పేర్కొన్నారు. 


ఇక ఈ దృశ్యాన్ని చూసి భక్తులతో పాటు ఆలయ పూజారులంతా పులకించిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నాయి.ఈ విషయం తెలియడంతో నంద్యాలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు సంజీవనగర్ రామాలయానికి (Sanjeevanagar Ramalayam) చేరుకున్నారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భారీ ఎత్తున భక్తులు సూర్య భగవానుడికి పూజలు నిర్వహించారు.


ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. తిరుమలలో అలాగే శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య భగవానుడి (Surya Bhagawanudu) ఆలయంలో భారీ ఎత్తున పూజలు, హోమాలు జరుగుతున్నాయి. తిరుమలలో (Tirumala) సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణ భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఈ ఉత్సవాలు ఇవాళ రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి. 


రథసప్తమి (Ratha Saptami) సందర్భంగా అరసవల్లి (Arasavalli) సూర్య భగవానుడి ఆలయంలో నిర్వహించి పూజల్లో భాగంగా.. తొలి పూజను ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ చేపట్టారు. తర్వాత పలువురు ప్రజా ప్రతినిధులు సూర్య భగవానుడిని (Surya Bhagawanudu) దర్శించుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.


Also Read: Modi on AP Bifurcation: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తీరుపై ప్రధాని మోదీ స్పందన.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు


Also Read: Flipkart TV Days: స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు.. రూ.16,500లకే 50 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook