RK Roja Selvamani: అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ఆర్‌కే రోజా సెల్వమణి దర్శించుకున్నారు. మంత్రిగా తిరుమలలో హల్‌చల్‌ చేసిన రోజా మాజీ మంత్రి హోదాలో తిరుమలను సందర్శించారు. ఎలాంటి హడావుడి లేకుండా ఆమె తిరుమలలో పర్యటించారు. ఇటీవల ఆమె తన వ్యక్తిగత సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీ, మాజీ సీఎం జగన్‌కు సంబంధించిన ఫొటోలు, వివరాలను తొలగించారు. దీంతో ఆమె వైసీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో తిరుమల సందర్శించిన సమయంలో మీడియా ఆమెను ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ మారుతున్నారా? అని ప్రశ్నించగా రోజా వాటిని కొట్టిపారేశారు. కాగా తిరుమలలో ఆమె రాజకీయ విమర్శలు చేయడం కలకలం రేపాయి. తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దని నిర్ణయించిన సమయంలో మళ్లీ ఆమె రాజకీయ విమర్శలు చేయడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan: గుడ్లవల్లేరు రహాస్య కెమెరాల ఘటనపై మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..?


 


తిరుమల శ్రీవారిని శనివారం ఆర్‌కే రోజా సందర్శించారు. ప్రత్యేక దర్శనం చేసుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. 'పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారం ఊహాగానమే' అని కొట్టిపారేశారు. ఇక ఏపీలో కూటమి పాలనపై రోజా తీవ్ర విమర్శలు చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో మహిళలపై జరిగిన సంఘటనపై ప్రభుత్వం సిగ్గుపడాలి' అని వ్యాఖ్యలు చేశారు.

Also Read: Gudlavalleru College: 'ఏడుపొస్తొంది..చచ్చిపోవాలనిపిస్తోంది' కన్నీళ్లు తెప్పిస్తున్న గుడ్లవల్లేరు విద్యార్థుల ఆడియో


 


'మచ్చుమర్రి సంఘటన జరిగివ 60 రోజులు అవుతున్నా ఆ పాప మృతదేహాన్ని ఇంకా కనిపెట్టలేకపోయారు. గుడ్లవల్లేరులోని హాస్టల్‌లో రహాస్య కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు ఫిర్యాదు ఏమీ జరగలేదని ఎస్పీ చెప్పడం దారుణం. కూటమి ప్రభుత్వ హయాంలో ర్యాగింగ్‌ విపరీతంగా పెరిగింది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలుపై పెట్టిన దృష్టినిపక్కన పెట్టి.. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంపై దృష్టి సారించాలి' అని రోజా హితవు పలికారు. 'పార్టీలు మారే వారిని ప్రజలు విశ్వసించరు. ఎంతమంది పార్టీని వీడినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు' అని ఎంపీల రాజీనామాపై రోజా వ్యాఖ్యానించారు.


పార్టీ మార్పు?
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆర్‌కే రోజా ప్రస్తుతం వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకు ఆమె వ్యక్తిగత పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశ, విదేశాల్లో వివహరిస్తూ వ్యక్తిగత పనులతో బిజీగా ఉన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో ఆమె భాగమవడం లేదు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లోన తన బయోలో వైఎస్సార్‌సీపీ పేర్లు.. పార్టీ గుర్తులు.. జగన్‌ ఫొటోలు వంటివి తొలగించారు. దీంతో రోజా పార్టీ మారుతారని పుకార్లు షికార్లు చేశాయి. తమిళనాడులో సినీ హీరో విజయ్‌ స్థాపించిన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీని వదిలేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఆమె పార్టీ మారేది లేనిది కొన్ని రోజుల్లో తెలియనుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook