Vijayawada: విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కోట్ల విలువైన మూడు కార్లు ధ్వంసం
RTC Bus Enters Into Car Show Room After Break Fails: బ్రేకులు ఫెయిలవడంతో విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా ఓ కార్ల షోరూమ్ వైపు దూసుకెళ్లగా.. కొన్ని కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
RTC Bus Break Fails: అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు విజయవాడలో బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి ఓ కార్ల షోరూమ్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కోట్ల విలువైన విలాసవంతమైన కార్లు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనతో విజయవాడలో భయానక పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రమాదంలో కొందరికి స్వల్ప గాయాలు కాగా ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు.
Also Read: Game Changer: మరో సంధ్య థియేటర్ కావొద్దు.. గేమ్ ఛేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సూచనలు ఇవే!
బ్రేకులు ఫెయిల్
విజయవాడలో గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ సిటీ బస్సు హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడకు రాకపోకలు సాగిస్తోంది. హనుమాన్ జంక్షన్ నుంచి శుక్రవారం విజయవాడకు వెళ్తున్న సమయంలో మధ్యాహ్నం పూట ఆకస్మాత్తుగా బస్సుకు సంబంధించిన బ్రేకులు ఫెయిలయ్యాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బస్సు డ్రైవర్ భయాందోళనకు గురయ్యాడు. అనంతరం ఏం చేయాలో పాలుపోక ప్రసాదంపాడుకు చేరుకున్నాక రోడ్డుపైకి కాకుండా ఫుట్‌పాత్‌పైకి ఎక్కించారు.
Also Read: Dokka Seethamma Mid Day Meal: ఏపీ విద్యార్థులకు జాక్ పాట్.. రేపటి నుంచి మధ్యాహ్న భోజనం
స్వల్ప గాయాలు
ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ కార్ల షోరూమ్ వైపు దూసుకెళ్లింది. అక్కడ పార్కింగ్‌లో ఉన్న కొత్త కార్లను ఢీకొట్టి బస్సు ఆగిపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తత.. చాకచక్యంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొందరు ప్రయాణికులు స్వల్పగాయాలవడం మినహా ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కాగా మూడు కార్లు ధ్వంసమయ్యాయి. కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక ఆర్టీసీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవగా.. బస్సు లోపల సీట్లు.. డోర్లు విరిగిపోయాయి. ఈ సంఘటనతో అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వెంటనే సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
మరో ప్రమాదం..
కృష్ణా జిల్లాలో మరో చోట బస్సు ప్రమాదం సంభవించింది. పమిడిముక్కల మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మంటాడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి దట్టంగా పొగలు వచ్చాయి. డ్రైవర్ అప్రమత్తతో బస్సులోని 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులోని ప్రయాణికులను వేరే బస్సు ఎక్కించి వారి ప్రాంతాలకు తరలించారు. ఈ బస్సు కాళేశ్వరరావు మార్కెట్ నుంచి గుడ్లవల్లేరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇంజిన్ వైరింగ్ షార్టేజ్ కారణంగానే పొగలు వచ్చాయని బస్సు డ్రైవర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook