TSRTC Special Buses: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు టీఎస్​ఆర్టీసీ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతుందని.. ఆర్టీసీ ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్​ వెల్లడించారు. ఈనెల 7 నుంచి 14 వరకు బస్సులను నడపనున్నామని తెలిపారు. పండుగ సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా భారీ సంఖ్యలో టీఎస్‌ ఆర్టీసీ బస్సులను నడపనున్నట్టు ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బ‌స్సుల‌కు కూడా అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వ‌ని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు హైద‌రాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్ తో పాటు న‌గ‌రంలో ముఖ్యమైన సెంటర్‌లలో ఉంటాయని పేర్కొన్నారు. 


సంక్రాంతి ప్రత్యేక బస్సులను పర్యవేక్షించడానికి 200 మంది అధికారులను సిబ్బంది నియమిస్తున్నట్టు చెప్పారు. టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తుగా టిక్కెట్లను రిజర్వ్‌ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ను సంప్రదించాలని సూచించారు.


తెలంగాణలో..


తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట వంటి ముఖ్యపట్టణాలతోపాటు అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.


ఏపీకి ప్రత్యేక సర్వీసులు...


ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు.. హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది.  


Also Read: Corona in Telangana: తెలంగాణలో కరోనా కోరలు- కొత్తగా 1,913 మందికి పాజిటివ్​


Also Read: Vanama Raghava Arrest: హైదరాబాద్‌లో వనమా రాఘవ అరెస్ట్.. కొత్తగూడెంకు తరలింపు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.