ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది. సస్పెన్షన్ ఆర్డర్‌పై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ( Ab Venkateswara rao ) అంశం మరోసారి చర్చకొచ్చింది. సుప్రీంకోర్టులో వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది. దేశభద్రతకు ముప్పు వాటిల్లే నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో ఏపీ ప్రభుత్వం ..మాజీ ఐబీ అధికారి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. దీనిపై వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. 


అయితే ద్రోన్‌ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావుని సస్పెండ్‌ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో.. ఇదివరకే స్పష్టం చేసింది. మరోవైపు ఏపీ ప్రభుత్వ సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు ( Supreme court ) ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు...హైకోర్టు ( Ap High court ) ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది.  


చంద్రబాబునాయుడు ( Chandrababu naidu ) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఏబీవీ ఉన్నత స్థానంలో ఉన్న కారణంగా నిఘా పరికరాల దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశముందని ప్రభుత్వం వాదించింది. Also read: AP: వేసవి నాటికి మరో 16 వందల మెగావాట్ల విద్యుత్