seven drowned in penna river kadapa district: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) కడప జిల్లాలోని సిద్ధవటంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెన్నా నదిలో సరదాగా స్నానం చేయడానికి వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం జరగగా.. ఇప్పటివరకు ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతమైన మరో ఇద్దరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడప జిల్లా ( kadapa district ) సిద్ధవటం దిగువపేటకు చెందిన వెంకట శివ తండ్రి చంద్రశేఖర్ వర్థంతి కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి ( tirupati) లోని కొర్లగుంటకు చెందిన వెంకటశివ స్నేహితులు 10 మంది హాజరయ్యారు. వీరంతా కలిసి పెన్నా నది (Penna River) వద్దకు వెళ్లారు. వారిలో శివ, మరో ఏడుగురు కలసి పెన్నా నదిలో స్నానానికి దిగారు. దీంతో వారంతా ఒక్కసారిగా నీటి ప్రవాహంలో మునిగిపోయారు. ఈ క్రమంలో శివ నీటి ప్రవాహం నుంచి ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన ఏడుగురు (Seven youngsters drown in Penna River) గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. Also read: AP Local Body Elections: కరోనా వైరస్ అడ్డంకి కాదు: అఫిడవిట్‌లో నిమ్మగడ్డ రమేష్ కుమార్


గల్లంతైన వారు సోమశేఖర్, యశ్వంత్, జగదీష్, రాజేష్, సతీష్, షన్ను, తరుణ్‌గా గుర్తించారు. గల్లంతైన వారిలో ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమవగా.. మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.  


Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook