ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. అనేక రైళ్లు దారి మళ్లింపు
Trains Cancelled Today: ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వీటితో పాటు అనేక రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.
Trains Cancelled Today: దక్షిణ మధ్య రైల్వే పరిధితో పాటు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లనున్న పలు రెళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా పలు రైళ్లు రద్దు చేయగా.. మరికొన్ని దారి మళ్లించినట్లు తెలిపారు. నెల్లూరు- పడుగపాడు మార్గంలో 18 రైళ్లు రద్దు చేయగా, రెండు రైళ్లు తాత్కాలికంగా నిలిపివేశారు. 10 రైళ్లు దారి మళ్లించారు. ఒక రైలు వేళల్లో మార్పు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
రద్దైన పలు రైళ్ల వివరాలు..
20895: రామేశ్వరం నుంచి భువనేశ్వర్
22859: పూరి నుంచి చెన్నె సెంట్రల్
17489: పూరి నుంచి తిరుపతి
12655: అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్
12967: చెన్నై సెంట్రల్ నుంచి జైపూర్
06426: నాగర్‌సోల్ నుంచి తిరువనంతపురం
06427: తిరువనంతపురం నుంచి నాగర్‌సోల్
06425: కొల్లాం నుంచి తిరువనంతపురం
06435: తిరువనంతపురం నుంచి నాగర్‌సోల్
12863: హౌరా నుంచి యశ్వంతపూర్
12269: చెన్నై సెంట్రల్ నుంచి హజరత్ నిజముద్దీన్
12842: చెన్నై సెంట్రల్ నుంచి హౌరా
12656: చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్
12712: చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ
12510: గువహటి నుంచి బెంగళూరు కంటోన్మెంట్
15930: న్యూ తినుసుకియా నుంచి తాంబరం
20890: తిరుపతి నుంచి హౌరా రైలు రద్దు
17651: చెంగల్‌పట్టు నుంచి కాచిగూడ రైలు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
దారి మళ్లించిన రైళ్ల వివరాలు..
12642: హజరత్ నిజాముద్దీన్ నుంచి కన్యాకుమారి
12616: న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్
22877: హౌరా నుంచి ఎర్నాకుళం
12845: భువనేశ్వర్ నుంచి బెంగళూరు కంటోన్మెంట్
22502: న్యూ తిన్‌సుకియా నుంచి బెంగళూరు
12270: హజరత్ నిజాముద్దీన్ నుంచి చెన్నై సెంట్రల్
12655: అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ రైలు
12622: న్యూదిల్లీ నుంచి చెన్నై సెంట్రల్ రైలు \
12296: దా నపూర్ నుంచి బెంగళూరు
12968: జైపూర్ నుంచి చెన్నై సెంట్రల్ రైలు దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.
13351: ధన్‌బాద్ నుంచి అలెప్పీ రైలు సుమారు 3 గంటలు ఆలస్యంగా నడుస్తోంది.
15906: డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి రైలు న్యూ జల్‌పాయిగుడి - కన్యకుమారి మధ్య తాత్కాలికంగా నిలిపివేశారు.
12708: హజరత్ నిజాముద్దీన్ నుంచి తిరుపతి రైలు బిట్రగుంట- తిరుపతి మధ్య తాత్కాలికంగా నిలిపివేశారు.
Also Read: ఉధృతంగా పెన్నా నది... వరదతో కోతకు గురైన హైవే... 5కి.మీ మేర ట్రాఫిక్ జామ్...
Also Read: స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఏపీకు అవార్డుల పంట, జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook