/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Swachh Sarvekshan Awards: జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలకు జాతీయ స్థాయిఅవార్డులు దక్కాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వం పట్టణ, నగర ప్రాంతప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంతో ముందుకు పోతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో రాష్ట్రానికి పెద్ద పీట దక్కింది. గత ఏడాది ఆరు అవార్డులు దక్కితే..ఈసారి 11 అవార్డులు వచ్చాయి. అదే విధంగా రాష్ట్రం గత ఏడాది 6వ స్థానంలో ఉండగా..ఈసారి 5వ స్థానానికి చేరింది. 

రాష్ట్రంలో పరిశుభ్ర నగరాల కేటగరీలో విజయవాడ 3వ ర్యాంక్, విశాఖపట్నం 9వ ర్యాంకు సాధించగా, ఇండోర్, సూరత్ పట్టణాలకు తొలి రెండు స్థానాలు(Swachh Sarvekshan Awards) దక్కాయి. టాప్ 10 లో నిలిచిన ఏకైక దక్షిణాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. చెత్త రహిత నగరాల విభాగంలో విజయవాడకు 5 స్టార్ రేటింగ్ రాగా, విశాఖపట్నంకు 3 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇంకా వివిధ విభాగాల్లో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలకు అవార్డులు దక్కాయి. వ్యర్ధ జలాల రీసైక్లింగ్ విభాగంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలు గుర్తింపు పొందాయి. ఈ విభాగంలో ఒకటి కంటే ఎక్కువ నగరాలు గుర్తింపు పొందడం ఏపీలోనే కావడం గమనార్హం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేశారు. 

ఇక కొత్తగా ప్రారంభించిన ప్రేరక్‌దౌర్ కేటగరీలో తిరుపతికి ప్లాటినం, విజయవాడ, రాజమండ్రిలకు స్వర్ణం, కడప, కర్నూలు, మదనపల్లికు రజత పతకాలు దక్కాయి. విశాఖపట్నం కాకినాడ, కందుకూరు, సత్తెనపల్లి మున్సిపాల్టీలకు కాంస్య పతకాలు లభించాయి. సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్‌లో భాగంగా 1-10 లక్షల జనాభా కేటగరీలో నెల్లూరు కార్పొరేషన్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 1-3 లక్షల విభాగంలో తిరుపతి నగరానికి 3వ ర్యాంకు దక్కింది. సిటిజన్ ఫీడ్ బ్యాక్ విభాగం 10-40 లక్షల జనాభా కేటగరీలో విశాఖపట్నంకు , 1-3 లక్షల కేటగరీలో తిరుపతికి ఉత్తమ నగరాల అవార్డు లభించింది. ఇతర విభాగాల్లో కూడా తాడేపల్లి, పలమనేరు, పుంగనూరు, పిఠాపురం నగరాలకు అవార్డులు లభించాయి.

Also read: చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ కాల్... అసెంబ్లీ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సూపర్ స్టార్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Ap receives better number of national swachh sarvekshan awards
News Source: 
Home Title: 

స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఏపీకు అవార్డుల పంట, జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు

స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఏపీకు అవార్డుల పంట, జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు
Caption: 
Swachh Award Zee News
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఏపీకు అవార్డుల పంట, జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, November 21, 2021 - 12:57
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
75
Is Breaking News: 
No