ఏపీ సర్కార్ కు గ్రీన్ ట్రిబ్యూనల్ షాక్; రూ.100 కోట్ల జరిమానా విధింపు !!
ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ గట్టి షాక్ ఇచ్చింది.
చంద్రబాబు ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు జరిపారనే కారణం చూపుతూ ఏకంగా రూ. 100 కోట్ల జరిమానా విధించింది. కాలుష్య నియంత్రణ మండళ్లు నివేదిక ఆధారంగా ఈ మేరకు జరిమానా విధించినట్లు తెలిసింది.
ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ వాటర్ మేన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీలు గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. దీనిపై నివేదిక అందించాలని కాలుష్య నియంత్రణ మండలికి గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు జరీ చేసింది. ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ మండలి దీనిపై నివేదికను సమర్పించింది..
కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం... కృష్ణా నదిలో ప్రతిరోజు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు నదిలో ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారని తేలింది. ఇదే అంశాన్ని నిదేదిక రూపంలో గ్రీన్ ట్రైబ్యునల్ కు సమర్పించింది. దీని ఆధారం చేసుకొని ఏపీ సర్కార్ ఈ మేరకు భారీ జరిమానా విధించారు
అయితే తాజా తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారని దానిపై ఉత్కంఠత నెలకొంది. దీనికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.