Laptop Blast in AP: ఎలక్ట్రానిక్​ ఉపకరణాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. షార్ట్​ సర్క్యూట్​, హెవీ లోడ్​ వర్క్ కారణంగా కొన్నిసార్లు అవి పేలి పోతుంటాయి. తాజాగా ఏపీలో ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని వర్క్ చేస్తుండగా ఒక్కసారిగా ల్యాప్​టాప్​ పేలడంతో (Laptop Blast) తీవ్రగాయాలపాలైంది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే...
కడప జిల్లా (Kadapa District) బి.కోడూరు మండలం మేకవారిపల్లెలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సుమతి వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంటి వద్దే విధులు నిర్వర్తిస్తుంది. రోజూలాగే ఇవాళ కూడా తన ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్‌ పెట్టి వర్క్‌ చేస్తుంది. ఇంతలో ల్యాప్​టాప్​ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో సుమతి తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో సుమతి గది లోపల లాక్​ వేసుకుని వర్క్ చేస్తోంది. 


ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే కడపలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం సుమతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆమెను కడప రిమ్స్​కి తీసుకెళ్లాలని సూచించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగకపోవడంతో ల్యాప్‌ట్యాప్‌ పేలిన విషయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. 


Also Read: Nandyala Road Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook