Nandyala Road Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

Nandyala Road Accident: ఏపీలోని నంద్యాల జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా... ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 10:43 AM IST
  • నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • కల్వర్టును ఢీకొట్టిన స్కార్పియో కారు
  • ముగ్గురు అక్కడికక్కడే మృతి
Nandyala Road Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

Nandyala Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఓ స్కార్పియో కారు కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం (ఏప్రిల్ 17) రాత్రి ఆళ్లగడ్డ మండలం గూబగుండం మెట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను కడప జిల్లా మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, సామ్రాజ్యమ్మగా గుర్తించారు. బేతంచెర్ల మద్దిలేటయ్య స్వామి దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. 

ఎన్టీఆర్ జిల్లాలో డివైడర్‌ను కొట్టిన బస్సు :

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో 15 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుగా దూసుకొస్తున్న లారీని తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Chiranjeevi Acharya: స్టెప్పులతో ఇరగదీసిన చిరు- చరణ్‌.. 'భలే భలే బంజారా' సాంగ్ ప్రోమో అదుర్స్  

Also Read: CSK vs GT: చివరి వరకూ ఉత్కంఠం..సీఎస్కేపై గుజరాత్ టైటాన్స్ విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News