AP Corona Update: ఏపీలో ఆగని కరోనా ఉధృతి, పెరిగిన కేసుల సంఖ్య
AP Corona Update: కరోనా మహమ్మారి ఏపీలో మరోసారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో కరోనా కేసుల విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదలైంది.
AP Corona Update: కరోనా మహమ్మారి ఏపీలో మరోసారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో కరోనా కేసుల విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదలైంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Corona Virus) కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) లో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోంది.కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 86 వేల 878 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..ఏకంగా 20 వేల 345 మందికి పాజిటివ్‌గా తేలింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18, విశాఖలో 12, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 10 మంది, ప్రకాశం జిల్లాలో 9, నెల్లూరులో 8, కృష్ణా జిల్లాలో 7, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో 108 ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో ఇప్పటివరకూ కరోనా కారణంగా 8 వేల 899 మంది మరణించారు. గత 24 గంటల్లో 14 వేల 502 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడం విశేషం. ఇప్పటివరకూ రాష్ట్రంలో 11 లక్షల 18 వేల 933 మంది కోలుకోగా..రాష్ట్రంలో ప్రస్తుతం 1 లక్షా 95 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1 కోటి 75 లక్షల 14 వేలమందికి వ్యాక్సిన్ (Vaccination) ఇచ్చారు.
Also read: RUIA Hospital tragedy: తిరుపతి రుయా ఆస్పత్రిలో Oxygen అందక 11 మంది కరోనా రోగుల మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook