తెలుగుదేశం పార్టీ ( Telug desam party ) , ఏపీ ప్రభుత్వానికి ( Ap Government ) సుప్రీంకోర్టు ( Supreme court ) నోటీసులు జారీ చేసింది. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి  భూమి కేటాయింపుపై దాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు..మూడు వారాల్లోగా సమాధానం కోరింది. గతంలో ఇదే పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ రాజధాని ( Ap Capital region ) ప్రాంతమైన అమరావతి ( Amaravati ) పరిధిలోని మంగళగిరి ( Mangalagiri ) లో తెలుగుదేశం పార్టీకు భూములు కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ( ycp mla Alla Ramakrishna reddy ) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి మరీ జరిపిన భూ కేటాయింపుల్ని రద్దు చేయాలని పిటీషనర్ కోరారు. జస్టిస్ నారిమన్ బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్‌ ఆర్కే తరపున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదనలు వినిపించారు. టీడీపీ ( TDP ) , ఏపీ ప్రభుత్వం, సీఆర్‌డీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.  గతంలో ఇదే పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ( Ap High court ) కొట్టేయడం గమనార్హం.


ఇదే భూమికి సంబంధించి కబ్జా ఆరోపణలు కూడా చేశారు పిటీషనర్ ఆర్కే. కబ్జా చేసిన స్థలంలో మంగళగిరి టీడీపీ ఆఫీసు కట్టారని ఆరోపించారు. ఆత్మకూరు పరిధిలోని 3.65 ఎకరాల వాగు భూమిని కబ్జా చేసి ఆఫీసు నిర్మాణం చేయడం ద్వారా పర్యావరణ చట్టాల్ని తుంగలో తొక్కారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై దాఖలైన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో..సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆర్కే. అటు టీడీపీ, సీఆర్డీఏతో పాటు ఏపీ ప్రభుత్వానికి కూడా ఈ అంశంపై కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కలిపి విచారించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. Also read: AP: పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే పూర్తి చేస్తుంది: బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు