ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) మూడు రాజధానుల అంశాన్ని సుప్రీంకోర్టు ( Supreme court ) మరో బెంచ్ కు బదిలీ చేస్తూ విచారణ ప్రారంభించింది. రైతుల తరపున జస్టిస్ నారీమన్ తండ్రి వాదిస్తుండటంతో...కేసును మరో బెంచ్ కు బదిలీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంలో ( 3 Capital issue ) సుప్రీంకోర్టులో ( Supreme court ) విచారణ ప్రారంభమైంది. అమరావతి రైతుల తరపున న్యాయవాదిగా జస్టిస్ నారీమన్ ( Justice nariman ) తండ్రి వాదిస్తుండటంతో కేసుకు ప్రాముఖ్యత పెరిగింది. అంతేకాకుండా కేసును మరో బెంచ్ కు మార్చాలని స్వయంగా జస్టిస్ నారీమన్ ఆదేశించారు. దాంతో సుప్రీంకోర్టు కేసును వేరే బెంచ్ కు బదిలీ చేసింది. పాలనా వికేంద్రీకరణ, రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వుల్ని నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


మరోవైపు ఇదే అంశంపై ఏపీ హైకోర్టు ( Ap High court ) లో కీలక పరిణాం చోటుచేసుకుంది. హైకోర్టులో దాఖలైన పలు పిటీషన్లపై విచారణ సందర్భంగా కేంద్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ( Central Government ) అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ లో గతంలో చెప్పిన విషయాన్నే మరోసారి స్పష్టం చేసింది. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయమని, తమ పాత్ర ఉండదని వెల్లడించింది. Also read: AP: పేదల ఇంటి నమూనాను పరిశీలించిన వైఎస్ జగన్