అర్హులందర్నీ సొంతింటి కల నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం ( Ap Government ) ప్రయత్నిస్తోంది. వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ ( ysr housing scheme ) లో భాగంగా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఓ మోడల్ హౌస్ నిర్మించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మోడల్ హౌస్ ను పరిశీలించారు.
అర్హులైన పేదలకు నిర్మించే ఇళ్ల కోసం ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందించింది. ఇందులో లివింగ్ రూమ్, బెడ్ రూమ్, కిచెన్, బాత్రూమ్, వరండా ఉండేట్టుగా నాణ్యతతో కూడిన ఇంటిని నిర్మించాలి. ఈ ప్రణాళిక ప్రకారం ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ( Ap housing corporation ) తాడేపల్లిలో ఓ మోడల్ హౌస్ ను నిర్మించింది. ఈ మోడల్ హౌస్ ( model house ) ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( ap cm ys jagan ) క్షుణ్ణంగా పరిశీలించారు. సెంటు స్థలంలో అంటే 48 గజాల్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇంటిని నిర్మించే క్రమంలో భాగంగా సౌకర్యవంతంగా నిర్మాణం చేసింది ఏపీ హౌసింగ్ కార్పొరేషన్. ఈ నిర్మాణానికి 2 లక్షల 50 వేలు ఖర్చయినట్టు అధికార్లు తెలిపారు. ఈ మోడల్ హౌస్ కు ఆమోదం లభిస్తే..ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ఇళ్లను పేదల కోసం నిర్మించి ఇవ్వనుంది ప్రభుత్వం.