Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు డాక్టరేట్ ఆఫర్, సున్నితంగా తిరస్కరించిన జనసేనాని
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆనందం, నిరాశ రెండూ కల్గించే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ జనసేనానికి డాక్టరేట్ ఆఫర్ చేసింది. పవన్ చేసిన సేవా కార్యక్రమాలకు ఈ డాక్టరేట్ ఇస్తున్నట్టు విశ్వవిద్యాలయం ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న జనసేన అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఓ పముఖ యూనివర్శిటీ నుంచి అత్యున్నత గౌరవం దక్కింది. పవర్ స్టార్ బిరుదుకు ముందు డాక్టరేట్ చేర్చేందుకు ఆ యానివర్శిటీ ఆఫర్ చేసింది.
ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో 3-4 నెలల్లో ఎన్నికలున్నాయి. రానున్న ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం-టీడీపీ కూటమి సిద్ధమౌతోంది. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ షూటింగ్ దశలో ఉన్న తన రెండు సినిమాలకు విరామం ఇచ్చారు. హరిహర వీరమల్లు సహా మరో రెండు సినిమాల షూటింగ్ ఇక ఎన్నికల తరువాతే జరగనుంది. ఈలోగా పవన్ కళ్యాణ్‌కు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్శిటీ నుంచి అత్యున్నత గౌరవం దక్కింది. పవన్ కళ్యాణ్‌కు డాక్టరేట్ ఇచ్చేందుకు ఆఫర్ చేసింది. జనవరి నెలలో జరిగే యూనివర్శిటీ 14వ స్మాతకోత్సవానికి హాజరై డాక్టరేట్ అందుకోవల్సిందిగా ఆహ్వానించింది. ఈ వార్త తెలియగానే పవన్ అభిమానుల్లో ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
అయితే అంతలోనే పవన్ కళ్యాణ్..అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేశారు. యూనివర్శిటీ ఇచ్చిన డాక్టరేట్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. తనను డాక్టరేట్‌కు ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందని అయితే తన కంటే గొప్ప వ్యక్తులు సమాజంలో చాలామంది ఉన్నారని పవన్ తెలిపారు. మరోవైపు ఏపీ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున యూనివర్శిటీ స్మాతకోత్సవాలకు హాజరుకాలేనని యూనివర్శిటీకు లేఖ రాశారు.
వేల్స్ యూనివర్శిటీ ఇచ్చిన డాక్టరేట్ ఆఫర్‌ను పవన్ కళ్యాణ్ తిరస్కరించారన్న వార్త తెలియగానే అభిమానులు నిరాశకు లోనయ్యారు. అభిమాన నేతను డాక్టర్ పేరుతో పిలిచే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఇంకొందరైతే అంత గొప్ప ఆఫర్ తిరస్కరించడం పవన్‌కే సాధ్యమైందని కామెంట్లు చేస్తున్నారు.
Also read: Kesineni Nani: టీడీపీకు రాజీనామా చేయనున్న కేశినేని నాని, వైసీపీలో చేరనున్నారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook