ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటివరకూ ముందస్తు ఎన్నికలుంటాయనే ప్రచారం సాగింది. కానీ వైసీపీ అధినేతల స్పష్టమైన ప్రకటనతో ఇప్పుడు అంతా 2024 ఎన్నికలపైనే దృష్టి సారించారు. ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలనే ఆలోచనతో ప్రతిపక్షం తెలుగుదేశం సిద్ధమౌతోంది. అటు అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ గడప గడపకు కార్యక్రమాన్ని మరింత యాక్టివ్‌గా చేయాలని యోచిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో టీడీపీ ఇప్పుడిప్పుడే యాక్టివ్‌గా మారుతోంది. నిన్న మొన్నటి వరకూ నిస్తేజంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ ఇప్పుడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కేడర్‌ను ఉత్తేజపరిచే చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లో ఎండగట్టేందుకు వివిధ కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు. నిత్యావసర ధరలు, ప్రభుత్వ పన్నులపై నిరసనలు పిలుపిస్తోంది. ఇదంతా ఓ ఎత్తైతే..మరోవైపు టీడీపీని బలోపేతం చేసేందుకు, ప్రజల్లో ఆదరణ పెంచేందుకు మరో వ్యూహం రచించారు చంద్రబాబు. 


రానున్న ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే


2024లో ఎలాగైనా తెలుగుదేశం అధికారంలో రావాలనే ఆలోచనతో అందుకు తగ్గ యోచనలు చేస్తున్నారు చంద్రబాబు. తన వయస్సు పైబడుతుండటంతో వారసుడిగా నారా లోకేష్‌కు ఏ విదమైన ఇబ్బంది లేకుండా ఉండేలా కొత్త వ్యూహం రచించారు. అది 40 శాతం టికెట్లు యువతకు ఇవ్వాలనే ప్రకటన. పార్టీలో సీనియర్లతో నారా లోకేష్‌కు ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండాలన్నా..పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలన్నా యువతకే సాధ్యం. అందుకే ఈ కొత్త ఫార్ములా తెరపై తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. 


ఒక కుటుంబం ఒకటే టికెట్


మరోవైపు కుటుంబానికి ఒకే టికెట్ సూత్రాన్ని అమలు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. యువతకు 40 శాతం టికెట్లు ఇస్తానని ప్రకటించడంతో టీడీపీ సీనియర్లు తమ వారసుల్ని తెరపై తీసుకొస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కనీసం 20-25 మంది వారసులే బరిలో ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


చంద్రబాబు ప్రకటించిన యువతకు 40 శాతం టికెట్ల విషయంలో పెద్దగా వ్యతిరేకత లేకపోయినా కుటుంబానికి ఒకే టికెట్ అనేది కాస్త ప్రతికూలంగా మారే పరిస్థితులున్నాయి. టీడీపీలో పాతుకుపోయిన సీనియర్ల కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువే ఆశావహులు సిద్ధమౌతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ..జనసేనతో పొత్తు కుదిరితే ఈ ఫార్ములా వర్కవుట్ అవుతుందా లేదా అనేది సందేహంగా మారింది. పొత్తు కుదిరితే ఈ ఫార్ములా కారణంగా కొంతమందికి అవకాశాలు బెడిసికొట్టే పరిస్థితి లేకపోలేదు. 


టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టనున్న ఈ రెండు కొత్త ఫార్ములాలు ఎంతవరకూ సఫలం కానున్నాయో వేచి చూడాలి. సీనియర్ల నుంచి అసమ్మతి వచ్చినా లేదా యువత ఎన్నికల్లో రాణించలేకపోయినా టీడీపీ వ్యూహం వర్కవుట్ కాకుండా బెడిసికొట్టే ప్రమాదముంది. 


Also read: MP Vijaysai Reddy : టీవీ ఛానెల్ పెడుతున్నా.. తేల్చుకుందాం రా! రామోజీ రావుకు విజయసాయి రెడ్డి సవాల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook